2024 దసరా సంబరాలు - పండగ సందడంతా ఈ ముద్దుగుమ్మలదే! - 2024 DUSSEHRA RELEASE MOVIES
దసరా టైమ్‌లోనే చాలా మంది పెద్ద హీరోలు తమ చిత్రాలను విడుదల చేస్తుంటారు. అయితే ఈ సారి ఈ పండక్కి విడుదల కానున్న చిత్రాలేంటి? అందులో అలరించనున్న హీరోయిన్లు ఎవరో చూద్దామా?
Published : Oct 8, 2024, 7:02 AM IST
2024 Dussehra Release Movies Heroines : దసరా వస్తుందంటే సినిమాలు పోటీపడి మరీ విడుదల అవుతుంటాయి. ఈ సారి పండుగను రెట్టింపు చేసే సరదాని పంచేందుకు చాలా సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. అందులో బడా హీరోల యాక్టింగ్‌తో పాటు ముద్దుగుమ్మల సందడికి కొదవేం లేదు. బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ నుంచి డాన్సింగ్ క్వీన్ సాయిపల్లవి దాకా మన భామ్మలు ఏయే సినిమాలతో మన ముందుకు రాబోతున్నారో ఓ లుక్కేద్దాం పదండి.
ఆలియా భట్ :
వాసన్ దర్వకత్వంలో కరణ్ జోహార్ నిర్మాతగా, వైదంగ్ రైనా హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'జిగ్రా'. అక్టోబర్ 11న రిలీజ్ కానున్న ఈ సినిమాలో ఆలియా భట్ ఓ అక్క పాత్రలో కనిపించనున్నారు. ఆమెతో పాటు మరో కథానాయిక పాత్రలో ఆకాంక్ష రంజన్ కూడా నటించారు. ఇతర కీలక పాత్రల్లో వేదాంగ్ రైనా, ఆదిత్య నందా, రాహుల్ రవీంద్రన్‌లు నటించారు.
త్రిప్తి దిమ్రి :
బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు హీరోగా, డైరెక్టర్ రాజ్ శాండిల్య తెరకెక్కిస్తున్న చిత్రం 'విక్కీ విద్యా కా వో వాలా వీడియో'. ఇందులో త్రిప్తి దిమ్రి, మల్లికా షరావత్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 11న ఈ చిత్రం థియోటర్లలో సందడి చేయనుంది.
రితికా సింగ్ :
రజనీకాంత్ హీరోగా పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్న సినిమా 'వెట్టయాన్'లో రితికా సింగ్, మంజు వారియర్, దుషార విజయన్ కథానాయికలుగా కనువిందు చేయనున్నారు. అమితాబ్ బచ్చన్, ఫహాద్ ఫాజిల్, రానా వంటి పెద్ద పెద్ద స్టార్లందరూ నటిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాష్లలో అక్టోబర్ 10న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
సాయి పల్లవి :
రాజ్ కుమార్ పెరియసామి డెరెక్షన్‌లో శివ కార్తికేయన్ హీరోగా రూపొందిన చిత్రం 'అమరన్'. రాజ్‌కమల్ ఫిల్మ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్, అలాగే సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. అక్టోబర్ 10న విడుదల కానున్న ఈ సినిమాలో సౌత్ ఫేమ్ సాయి పల్లవి ఫీమేల్ లీడ్‌గా అలరించనుంది.
కావ్యా థాపర్ :
గోపీచంద్ హీరోగా ప్రముఖ డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న 'విశ్వం'లో కావ్యా థాపర్ కథానాయిక పాత్రలో కనువిందు చేయనుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, చిత్రాలయం స్టూడియోస్ వారు అక్టోబర్ 11న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
సంగీర్తనా విపిన్ :
దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో సందీప్ రెడ్డి బండ్ల దర్వకత్వం వహిస్తున్న చిత్రం 'జనక అయితే గనక'. ఇందులో సుహాస్ హీరోగా నటిస్తుండగా సంగీర్తనా విపిన్ హీరోయిన్ పాత్ర పోషిస్తున్నారు. వెన్నెల కిశోర్, మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్ 12న ఈ చిత్రం విడుదల కానుంది.
అలాంటి సినిమాల్లో నటించాలని ఉంది : అనన్య పాండే
మళ్లీ ఇన్నాళ్లకు 'ఒక్కడు' కాంబో రిపీట్! - Bhumika Chawla New Movie