Kotak Kanya Scholarship 2024 Details: దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన పేద బాలికల ఉన్నత విద్య కోసం "కోటక్ కన్య స్కాలర్‌షిప్"ను అందిస్తోంది కోటక్ మహీ. ఈ స్కాలర్‌షిప్ కింద ప్రతి బాలికకు ఏడాదికి రూ.1.5లక్షల ఆర్థిక సహాయం అందిచనుంది. ఈ స్కాలర్‌షిప్‌ను విద్యార్థిని.. తన కోర్సు పూర్తి చేసే వరకు ఇస్తారు. బాలికలను ఉన్నత విద్యవైపు ప్రోత్సహించే విధంగా ఈ స్కాలర్‌షిప్‌ను అందిస్తున్నట్లు సంస్థ తెలిపింది. ఈ మొత్తాన్ని బాలికలు.. ల్యాప్‌టాప్ లేదా తమ హాస్టల్, ట్యూషన్, ఇతర ఖర్చుల కోసం వినియోగించుకోవచ్చని వివరించింది. అయితే, ఈ స్కాలర్‌షిప్‌ను కేవలం ఇంటర్ పూర్తి చేసిన వారికి మాత్రమే అందజేస్తారు. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
స్కాలర్‌షిప్‌నకు ఎవరు అర్హులు?
- దేశవ్యాప్తంగా ఉన్న బాలికలు అందరూ అర్హులు.
- ఇంటర్‌లో 75శాతానికి మించి మార్కులు సాధించి ఉండాలి.
- బాలిక కుటుంబ వార్షికాదాయం రూ. 6 లక్షల లోపు ఉండాలి.
- దేశంలోని NIRF/NAAC సంస్థలతో గుర్తింపు పొందిన ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఇంజినీరింగ్, MBBS, BDS, ఇంటిగ్రేటెడ్ LLB (5 సంవత్సరాలు), B.ఫార్మసీ, B.Sc వంటి ప్రొఫెషనల్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అభ్యసిస్తున్న మొదటి ఏడాది మహిళా విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
- కోటక్ మహీంద్రా గ్రూప్, కోటక్ ఎడ్యూకేషన్ ఫౌండేషన్, బడ్డీ ఫర్ స్టడీ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలు ఇందుకు అనర్హులు.
- అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ 30లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చేసేందుకు కావాల్సిన పత్రాలు
- ఇంటర్ మార్క్‌షీట్
- తల్లిదండ్రుల ఆదాయ ధ్రువీకరణ పత్రం
- విద్యార్థిని చదువుతున్న కోర్సు ఫీజు వివరాలు
- బోనఫైడ్ సర్టిఫికెట్
- కాలేజీ సీట్ అలాట్మెంట్ లెటర్
- ప్రవేశ పరీక్ష స్కోర్ కార్డ్
- ఆధార్ కార్డ్
- బ్యాంక్ పాస్‌బుక్
- పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో
- వైకల్యం ఉంటే సర్టిఫికెట్
- డెత్ సర్టిఫికెట్(తల్లి లేదా తండ్రి మరణిస్తే)
- ఇంటి ఫొటోలు
దరఖాస్తు విధానం
- ఈ స్కాలర్‌షిప్‌నకు అప్లై చేయాలనుకునే బాలికలు ఈ https://www.buddy4study.com/page/kotak-kanya-scholarship#scholarships లింక్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత Buddy4Study పేజ్‌లో మీ వివరాలు ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది.
- లాగిన్ అయ్యాక ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ పేజీ కనిపిస్తుంది.
- వెంటనే Kotak Kanya Scholarship 2024-25 కు సంబంధించిన పేజీకి వెళ్తుంది.
- అక్కడ స్టార్ట్ అప్లికేషన్ బటన్‌పై క్లిక్ చేసి అవసరమైన వివరాలు ఎంటర్ చేయాలి.
- అనంతరం పత్రాలను అప్లోడ్ చేసి కింద ఉన్న నియమనిబంధనలు(టర్మ్స్ అండ్ కండీషన్స్) అంగీకరించాలి.
- ఆ తర్వాత ప్రివ్యూపై క్లిక్ చేసి వివరాలన్ని సరిగ్గా ఉన్నాయే లేదో చెక్ చేసుకుని సబ్మిట్ కొట్టాలి.