ETV Bharat / business

స్టెప్​-అప్​ Vs స్టెప్​-డౌన్ హోమ్ లోన్​ - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్? - Step Up Home Loan - STEP UP HOME LOAN

Step Up Home Loan : మీరు హోమ్ లోన్ తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. చాలా బ్యాంకులు ఇప్పుడు స్టెప్​-అప్​ హోమ్​ లోన్స్​, స్టెప్​-డౌన్​ హోమ్​ లోన్స్​​ ఇస్తున్నాయి. వీటిలో ఏది మీకు బెస్ట్ ఆప్షన్ అవుతుందో తెలుసా?

Type of Repayment Options Available on Home Loans
What Are Step-down Home Loans? (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 9, 2024, 4:15 PM IST

Step Up Home Loan : మనలో చాలా మందికి సొంతింటి కల ఉంటుంది. కానీ దానిని నెరవేర్చుకోవడం అంత సులువు కాదు. చాలా మంది సొంతిల్లు కొందామని ప్రయత్నించి, ఈఎంఐ భారం గురించి ఆలోచించి తమ నిర్ణయాన్ని ఎప్పటికప్పుడు వాయిదా వేస్తుంటారు. ఈలోగా ఇళ్ల ధరలు భారీగా పెరిగిపోతుంటాయి. దీనితో వారి సొంతింటి కల కలగానే మిగిలిపోతుంటుంది. ముఖ్యంగా కెరీర్‌ ఆరంభంలో ఉన్న వారికి ఇలాంటి చేదు అనుభవం ఎదురవుతూ ఉంటుంది. భవిష్యత్‌లో వేతనం పెరుగుతుందన్న నమ్మకం ఉన్నా, అప్పటి వరకు వేచి చూస్తే ఇళ్ల ధరలు ఊహకందనంత ఎక్కువగా పెరిగిపోతుంటాయి. ఇలాంటి వారి కోసమే, చాలా బ్యాంకులు 'స్టెప్‌-అప్‌ హోమ్‌లోన్స్​' (Step- up home loan) అందిస్తున్నాయి.

ఈఎంఐ ఎలా ఉంటుంది?
ఉదాహరణకు ఓ 25 ఏళ్లకు గృహ రుణం తీసుకుంటే, ఆ మొత్తాన్ని బట్టి నెలనెలా ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. తొలినాళ్లలో ఈఎంఐలో అసలు తక్కువగా, వడ్డీ భాగం అధికంగా ఉంటుంది. ఏళ్లు గడిచేకొద్దీ చెల్లించే మొత్తంలో అసలు మొత్తం (ప్రిన్సిపల్‌ అమౌంట్) పెరుగుతుంటుంది.

దీనిని మరింత సింపుల్​గా చెప్పాలంటే, స్టెప్‌-అప్‌ హోమ్‌ లోన్‌ తీసుకుంటే, ఆరంభంలో ఈఎంఐ మొత్తం తక్కువగా ఉంటుంది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ ఈఎంఐ మొత్తం పెరుగుతుంటుంది. ఎవరికైనా కెరీర్‌ ప్రారంభంలో జీతభత్యాలు తక్కువగా ఉంటాయి. తర్వాత అవి క్రమంగా పెరుగుతుంటాయి. అలాంటి వారికి ఈ స్టెప్​-అప్​ హోమ్​ లోన్​ ప్రయోజనకంగా ఉంటుంది. ప్రస్తుతం దేశంలోని చాలా బ్యాంకులు ఈ తరహా రుణాలను అందిస్తున్నాయి.

లాభనష్టాలు ఇవే!
స్టెప్‌-అప్​ హోమ్‌ లోన్‌ విధానంలో ఈఎంఐ తక్కువగా ఉంటుంది. అందువల్ల ఎక్కువ రుణ మొత్తాన్ని పొందేందుకు వీలు ఉంటుంది. ముఖ్యంగా తక్కువ వయస్సులోనే గృహ రుణం తీసుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీర్ఘకాలం పాటు ఈఎంఐ చెల్లించే వెసులుబాటు లభిస్తుంది. కెరీర్‌ ఆరంభంలోనే ఆదాయపు పన్ను ప్రయోజనాలు కూడా పొందవచ్చు.

కానీ ఇక్కడ గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే, సాధారణ గృహ రుణాలతో పోలిస్తే స్టెప్‌-అప్​ హోమ్‌ లోన్​లపై ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ వేతనంలో ఊహించినంత పెరుగుదల లేకపోతే, భవిష్యత్‌లో ఈఎంఐ చెల్లించడం చాలా భారమయ్యే అవకాశం ఉంటుంది.

Step Down Home Loan
ఈ తరహా హోమ్‌ లోన్‌ విధానంలో, కాలక్రమేణా మీరు చెల్లించాల్సిన ఈఎంఐ మొత్తం తగ్గుతుంటుంది. కెరీర్‌లో మంచి పొజిషన్‌లో ఉండి, ఎక్కువ మొత్తంలో ఆర్జిస్తూ, భవిష్యత్‌లో ఈఎంఐ భారం తగ్గించుకోవాలనుకునే వారికి, ఈ స్టెప్​-డౌన్​ హోమ్​ లోన్​ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఆరంభంలో ఎక్కువ మొత్తంలో ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

ఏది బెస్ట్ ఆప్షన్​!
గృహ రుణం కోసం ప్రయత్నిస్తున్నవారు, తమ వయస్సును బట్టి స్టెప్‌-అప్‌ లేదా స్టెప్‌డౌన్‌ రుణాలను ఎంచుకోవాలి. అయితే సాధారణ హోమ్​ లోన్​తో పోలిస్తే, ఇవి ఎంత వరకు ప్రయోజనకరంగా ఉంటాయో బేరీజు వేసుకున్నాకే తుది నిర్ణయం తీసుకోండి. అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహాలు కచ్చితంగా తెలుసుకోవాలి.

ఎంతో ఇష్టపడి కొత్త బైక్​ కొనుక్కున్నారా? ఈ టాప్​-10 మెయింటెనెన్స్​ టిప్స్​ మీ కోసమే! - Bike Maintenance Tips

మీరు తరచూ రైళ్లలో ప్రయాణిస్తూ ఉంటారా? మరి CC, EC, 3E, EA క్లాస్​ల గురించి తెలుసా? - Indian Train Classes

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.