How To Download e-PAN On Mobile : బ్యాంకు నుంచి మొత్తంలో నగదు విత్‌డ్రా చేయాలన్నా, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా, ఇలా ఎటువంటి ఆర్థిక లావాదేవీలైనా సజావుగా నిర్వహించాలన్నా పాన్ కార్డు ఉండాల్సిందే. అంతేకాకుండా పాన్ కార్డు గుర్తింపు కార్డుగా కూడా ఉపయోగపడుతుంది. అందుకే పాన్ కార్డ్ పోయినా, లేదా ఇంటి వద్ద మర్చిపోయినా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అయితే ఇకపై అలాంటి సమస్య ఉండదు. మీరు ఉన్నచోటనే చాలా సులువుగా ఈ-పాన్ కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వాస్తవానికి ఈ-పాన్ కార్డును ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవడానికి మూడు పద్ధతులు ఉన్నాయి. అవేంటో, వాటి ప్రాసెస్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.
1. PAN Card Download process – NSDL : నేషనల్ సెక్యూరిటీ డిపాజిటరీ లిమిటెడ్ (ఎన్ఎస్డీఎల్) నుంచి పాన్‌కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా అంటే?
- ముందుగా మీరు NSDL అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
- తర్వాత డౌన్లోడ్ ఈ-పాన్ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- ఆపై మీ పాన్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
- తరువాత మీ ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలి.
- మీరు పుట్టిన నెల, సంవత్సరాన్ని ఎంటర్ చేయాలి.
- ఆ తర్వాత క్యాప్చాను ఎంటర్ చేసి, సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి.
- వెంటనే మీ మొబైల్ లేదా ఈ-మెయిల్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి.
- ఇవన్నీ పూర్తైన తర్వాత ఆఖరిగా ఈ-పాన్ కార్డు డౌన్లోడ్ బటన్‌పై క్లిక్ చేయాలి. అంతే సింపుల్!
- పీడీఎఫ్ ఫార్మాట్లో ఈ-పాన్ కార్డ్ డౌన్లోడ్ అవుతుంది.
- ఈ-పాన్ పీడీఎఫ్‌కు పాస్వర్డ్ ప్రొటక్షన్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ మీ పుట్టిన తేదీ!
2. Pan Card Download process – UTIITSL : మీరు యూటీఐ ఇన్ఫ్రాస్ట్రెక్టర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ నుంచి కూడా పాన్‌కార్డును డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే?
- ముందుగా మీరు UTIITSL అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- మీ పాన్ కార్డ్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత మీరు పుట్టిన నెల, సంవత్సరాన్ని ఎంటర్ చేయండి.
- ఆపై క్యాప్చాను ఎంటర్ చేసి, సబ్మిట్ బటన్‌ను నొక్కండి.
- ఆ తర్వాత మళ్లీ క్యాప్చా ఎంటర్ చేసి, గెట్ ఓటీపీపై నొక్కండి.
- వెంటనే మీ మొబైల్ లేదా ఈ-మెయిల్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేయాలి. అంతే సింపుల్!
- తరువాత ఈ-పాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి.
PAN Card Download Process Via Income Tax Website : ఇన్‌కం ట్యాక్స్ వెబ్సైట్ నుంచి కూడా పాన్‌కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే?
- ముందుగా మీరు www.incometax.gov.in వెబ్సైట్ ఓపెన్ చేయండి.
- చెక్ స్టేటస్/ డౌన్లోడ్ పాన్ ఆప్షన్‌ను ఎంచుకోండి.
- మీ ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
- గెట్ ఓటీపీపై క్లిక్ చేసి, మీ మొబైల్‌కు వచ్చిన ఆ ఓటీపీని ఎంటర్ చేయండి.
- ఆ తర్వాత డౌన్లోడ్ యువర్ పాన్ కార్డ్ అనే ఆప్షన్ వస్తుంది.
- దానిపై క్లిక్ చేసి మీ ఈ-పాన్ కార్డును డౌన్లోడ్ చేసుకోండి. అంతే సింపుల్!
మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ 5 తప్పులు చేయవద్దు! - Mutual Fund Investment
మీ కారు మైలేజ్ పెరగాలా? ఈ టాప్-8 టిప్స్ మీ కోసమే! - How To Imporve Car Mileage