FASTag Management During Car Sale : ఫాస్టాగ్ అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రయాణాలు చాలా సౌకర్యవంతంగా మారాయి. టోల్ గేట్ల వద్ద గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి తప్పిపోయింది. ముఖ్యంగా నగదు/ చిల్లర సమస్య లేకుండా పోయింది.
ఫాస్టాగ్‌కు మీ వెహికల్ రిజిస్ట్రేషన్ వివరాలు, బ్యాంకు అకౌంట్ వివరాలు లింక్ అయ్యి ఉంటాయి. కనుక ఆటోమెటిక్‌గా మీ అకౌంట్ నుంచి టోల్ ఫీజు చెల్లింపు జరిగిపోతుంది. పైగా వెంటనే మీకు సదరు పేమెంట్ గురించి మెసేజ్ కూడా వస్తుంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంటుంది. ఒక వేళ మీరు మీ కారును అమ్మేయాలని అనుకుంటే, అప్పుడు ఫాస్టాగ్ విషయంలో మీరు కొన్ని కీలకమైన పనులు చేయాల్సి ఉంటుంది. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం.
FASTag Considerations While Selling Your Vehicle
మీ కారును ఇతరులకు అమ్మేటప్పుడు ఫాస్టాగ్‌ను కూడా మేనేజ్ చేయాలి. అప్పుడే బయ్యర్‌కు, మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ట్రాన్సాక్షన్ పూర్తి అవుతుంది. ఇందుకోసం మీరు చేయాల్సిన పనులు ఏమిటంటే?
1. ఫాస్టాగ్ బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్
మీ ఫాస్టాగ్‌లో ఏమైనా బ్యాలెన్స్ ఉంటే, దానిని పూర్తిగా వాడుకోవాలి. లేదా కొత్త ఓనర్‌కు ఆ బ్యాలెన్స్‌ను బదిలీ (ట్రాన్స్ఫర్) చేయాలి. ఇందుకోసం మీ ఫాస్టాగ్ ఇష్యూయర్‌ను లేదా కస్టమర్ కేర్‌ను సంప్రదించాలి.
2. అప్డేట్ వెహికల్ డీటైల్స్
ఒక వేళ మీరు కొత్త కారు లేదా వాహనం కొనుగోలు చేస్తే, ఫాస్టాగ్ అకౌంట్లో ఆ వివరాలను అప్డేట్ చేయాలి. అప్పుడే మీకు ఎలాంటి సర్వీస్ సమస్యలు రాకుండా ఉంటాయి.
3. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్
మీ నుంచి కారు కొనుగోలు చేసిన బయ్యర్‌కు కచ్చితంగా 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్' (NOC) ఇవ్వాలి. ఫాస్టాగ్ విషయంలో ఎలాంటి పెండింగ్ డ్యూస్, ఆబ్లిగేషన్స్ లేవని దీని ద్వారా మీరు ధ్రువీకరించినట్లు అవుతుంది. పైగా ఇది ఫాస్టాగ్ ట్రాన్స్‌ఫర్‌కు ఒక ప్రూఫ్‌గా కూడా ఉపయోగపడుతుంది.
4. కీ డాక్యుమెంట్స్
మీ వద్ద వెహికల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫాస్టాగ్ రిసీట్, ఇన్సూరెన్స్ పేపర్స్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఎందుకంటే, ఫాస్టాగ్ బ్యాలెన్స్‌ను ట్రాన్స్ఫర్ చేయడానికి ఇవన్నీ అవసరం.
5. డీయాక్టివేట్ ఫాస్టాగ్
మీ కారును అమ్మేసిన తరువాత, దానితో లింకై ఉన్న ఫాస్టాగ్‌ను డీయాక్టివేట్ చేయాలి. ఇందుకోసం మీకు ఫాస్టాగ్ ఇష్యూ చేసిన ఇష్యూయర్‌ను సంప్రదించాలి. మీరు కనుక నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) నుంచి ఫాస్టాగ్ తీసుకుని ఉంటే, కస్టమర్ కేర్ హెల్ప్‌లైన్ నంబర్ - 1033కి కాల్ చేసి, ఫాస్టాగ్‌ను డీయాక్టివేట్ చేయించుకోవాలి.
భవిష్యత్ కోసం ఇన్వెస్ట్ చేయాలా? రిస్క్ లేని టాప్-10 స్కీమ్స్ ఇవే! - Top 10 Risk Free Schemes