ETV Bharat / business

అనంత్-రాధిక పెళ్లి ఖర్చు ఎంతో తెలుసా? కొడుకు కోసం అంబానీ చేసింది అంతేనా! - Anant Ambani Radhika Wedding - ANANT AMBANI RADHIKA WEDDING

Anant Ambani Wedding Cost : ప్రపంచంలోని కుబేరుల్లో ఒకరు, రిలయెన్స్‌ అధినేత ముకేశ్‌ అంబానీ తన చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ పరిణయాన్ని అత్యంత ఆడంబరంగా నిర్వహిస్తున్నారు. ఈ వివాహ వేడుకలు దేశ ప్రజలనే కాదు యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆ పెళ్లికి సంబంధించిన అనేకానేక విశేషాలు, దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. మరోవైపు ఇంత గ్రాండ్​గా జరిపించిన పెళ్లి వేడుకల కోసం ముకేశ్ అంబానీ ఎంత ఖర్చు చేశారనే సర్వత్రా చర్చ జరగుతోంది.

Anant Ambani Radhika Weddin
Anant Ambani Radhika Wedding (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 13, 2024, 1:02 PM IST

Anant Ambani Wedding Cost : ఆసియాలోనే అత్యంత సంపన్నుడు, ఆగర్భ శ్రీమంతుడు రిలయెన్స్‌ అధినేత ముకేశ్​ అంబానీ చిన్నకుమారుడు అనంత్‌ వివాహం యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఏడు నెలలక్రితం మొదలైన వేడుకలు ఈనెల 14 తేదీతో ముగియనున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఎంతో మంది అనంత్‌-రాధిక పరిణయానికి హాజరయ్యారు. ప్రీ-వెడ్డింగ్‌ మొదలు పరిణయ వేడుకలు కనీవినీ ఎరగనిరీతిలో జరుగుతున్నాయి. తన చిన్న కుమారుడు అనంత్‌ వివాహాన్ని నభూతో నభవిష్యతి అనే రీతిలో జరిపిస్తున్న ముకేశ్​ అంబానీ, ఈ వేడుకకు ఎంత ఖర్చు చేశారనే విషయమై చర్చ జరుగుతోంది.

గ్లోబర్​ స్టార్లతో ప్రదర్శనలు
ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్డ్‌ కన్వెన్షన్‌లో జరిగిన అనంత్‌ అంబానీ-రాధిక మర్చంట్‌ వివాహ వేడుకలు మార్చిలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రి-వెడ్డింగ్‌ ఈవెంట్‌తో మొదలయ్యాయి. ఈనెల 12న వారి పరిణయం జరిగింది. 13, 14 తేదీల్లో రిసెప్షన్‌ జరగనుంది. ఈ వివాహానికి సంబంధించిన ఫొటోలు, దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కుప్పతెప్పలుగా దర్శనమిస్తున్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి వివిధ రంగాలకు చెందిన ఎంతో మంది ప్రముఖులు అనంత్‌-రాధిక పరిణయానికి హాజరయ్యారు. గ్లోబర్‌ స్టార్లు జస్టిన్‌ బీబర్‌, రిహానా, బాలీవుడ్‌ ప్రముఖుడు దిల్జీత్‌ దోసాంజ్‌ వంటి వారు ప్రదర్శనలు ఇచ్చారు.

రూ.5,000 కోట్లు ఖర్చు
అత్యంత ఆడంబరంగా నిర్వహిస్తున్న తన చిన్నకుమారుడు అనంత్‌ అంబానీ వివాహవేడుక కోసం ముకేశ్‌ అంబానీ పెద్దమొత్తంలో ఖర్చు చేసినట్లు కనిపిస్తుంది. అయితే సగటు భారతీయులు తమ కుటుంబంలో వివాహ వేడుకల కోసం తమ ఆస్తిలో ఖర్చుచేసే మొత్తాలతో పోలిస్తే రిలయెన్స్ అధినేత ముకేశ్‌ అంబానీ తన కుమారుడి వివాహానికి చేసిన ఖర్చు ఆయన సంపదలో చాలా చిన్న మొత్తమని సమాచారం. ఈ మొత్తం వివాహ వేడుక కోసం రూ.4,000 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల వరకు ఖర్చుచేసి ఉంటారని అంచనా. ఆ మొత్తం ముకేశ్‌ అంబానీ నికర సంపదలో కేవలం అర శాతం మాత్రమే అని ఫోర్బ్స్‌ పేర్కొంది.

అనంత్‌-రాధిక వివాహ వేడుకల్లో భాగంగా ముకేశ్‌-నీతా అంబానీలు దివ్యాంగులకు సామూహిక వివాహాలు జరిపించారు. జులై 2న పాల్ఘర్‌లోని స్వామి వివేకానంద విద్యామందిర్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 3న గుజరాతి వివాహ సంప్రదాయంలో భాగంగా మామేరు ఉత్సవం పెద్దఎత్తున జరిపించారు. ముకేశ్‌-నీతా అంబానీలు అనంత్‌-రాధిక వివాహ వేడుకలను హిందు వైదిక సంప్రదాయం ప్రకారం జరిపిస్తున్నారు. ఈనెల 5న జరిగిన సంగీత్‌ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. ఈనెల 13న శుభఆశీర్వాద్‌ వేడుక, 14న మంగళ్‌ ఉత్సవ్‌తో వేడుకలు ముగుస్తాయి.

వరమాల వేడుకలో అనంత్, రాధిక ఫుల్ ఫన్- ఒకరినొకరు ప్రామిస్​ చేసుకుని! - Anant Radhika Marriage

అట్టహాసంగా అనంత్​, రాధిక వెడ్డింగ్- అంబానీల పెళ్లికి హాజరైన అతిరథ మహారథులు - Anant Ambani Marriage

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.