Sikkim Girl Cheated By Her FB Friend : ఉద్యోగం కోసం వెతుకున్న ఓ యువతిని ట్రాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఓ యువకుడిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న నెబ్ సరాయీ పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు.
సిక్కిం టు దిల్లీ
దిల్లీలో నివాసం ఉంటున్న పరాస్ అనే యువకుడికి సిక్కింకు చెందిన ఓ అమ్మాయితో ఫేస్బుక్ ద్వారా పరియం ఏర్పడింది. అప్పటికే ఉద్యోగాన్వేషణలో ఉన్న ఆ అమ్మాయికి జాబ్ ఇప్పిస్తానని దిల్లీకి రావాలని ఆఫర్ చేశాడు పరాస్. దీంతో అతడిని నమ్మి జనవరి 10న దిల్లీకి చేరుకున్న ఆమె పరాస్తో కలిసి ఖాన్‌పుర్‌లోని ఓ అపార్ట్మెంట్లో నివాసం ఉంది. ఈ సమయంలో వీరిద్దరూ శారీరకంగా దగ్గరయ్యారు. అలా వీరి మధ్య పెళ్లి ప్రస్తావన కూడా వచ్చింది. తనను పెళ్లి చేసుకోవాలని యువకుడిని కోరింది యువతి. ఇందుకు పరాస్ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. పెళ్లి విషయంలో పరాస్‌పై యువతి పదే పదే ఒత్తిడి తీసుకువచ్చింది. అలా జనవరి 30న కూడా పెళ్లి గురించి అడగ్గా కోపోద్రిక్తుడయ్యాడు పరాస్. గదిలో ఉన్న ఇనుప రాడ్డుతో యువతి తలపై గట్టిగా బాదాడు. స్టవ్‌పై ఉన్న వేడి వేడి ఆహార పదార్థాలను ఆ యువతి శరీరంపై విసిరేశాడు. దీంతో ఆ యువతి ముఖం, చేతులు కాలాయి.
అంతటితో ఆగకుండా బాధితురాలిని గదిలో బంధించి అక్కడి నుంచి పరారయ్యాడు. అలా దాదాపు నాలుగైదు గంటల పాటు గాయాలపాలైన స్థితిలోనే గదిలో బాధపడుతూ ఉంది యువతి. ఆ తర్వాత యువతి అరుపులు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పరాస్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుడు దిల్లీ నుంచి పారిపోయేందుకు ప్రయత్నించే క్రమంలో అతడిని సత్‌బరి దగ్గర అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటనలో గాయపడ్డ యువతికి 20 చోట్ల గాయాలయ్యాయని పోలీసులు తెలిపారు.
విద్యార్థినిపై టీచర్ లైంగిక వేధింపులు
అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసింది ఓ యువతి. ఈ ఉదంతం యూపీలోని పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ గోరఖ్‌పుర్ యూనివర్సిటీలో వెలుగు చూసింది. ఈ ఘటనపై బాధిత విద్యార్థిని వైస్ ఛాన్సలర్ సహా గవర్నర్‌కు ఫిర్యాదు చేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ రాజ్ భవన్‌కు మెయిల్ ద్వారా ఓ లేఖను పంపింది. ఇందులో తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది.
తమిళ నటుడు విశాల్ కొత్త పార్టీ! క్లారిటీ ఇచ్చిన హీరో
'మంచి పనులు చేసే వారికి గౌరవం దక్కదు'- రాజకీయాలపై నితిన్ గడ్కరీ ఆవేదన