ETV Bharat / bharat

మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకుంటారా? - 6 రోజుల పాటు IRCTC టూర్​ ప్యాకేజీ! ఈ ప్లేస్​లు కూడా చూడొచ్చు! - IRCTC Treasures of Tamil Nadu - IRCTC TREASURES OF TAMIL NADU

IRCTC Tamil Nadu Tour Package: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు, ప్రసిద్ధి చెందిన ప్రదేశాలను చూడాలని చాలా మంది అనుకుంటుంటారు. కానీ పలు కారణాల వల్ల అది సాధ్యం కాకపోవచ్చు. అలాంటి వారికి ఉపయోగపడేలా తమిళనాడులోని పలు ప్రదేశాలు చూసేందుకు IRCTC టూరిజం అద్దిరిపోయే ప్యాకేజీ తీసుకొచ్చింది. ఆ వివరాలు ఈ స్టోరీలో..

IRCTC Tamil Nadu Tour Package
IRCTC Treasures of Tamil Nadu Tour Package (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Jul 12, 2024, 5:16 PM IST

IRCTC Treasures of Tamil Nadu Tour Package: తమిళనాడులో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలు అంటే.. శ్రీ రంగం ఆలయం, మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం సహా ఇతర దేవాలయాలు గుర్తొస్తాయి. ఈ దేవాలయాలను దర్శించుకోవాలని చాలామందికి ఉంటుంది. అయితే సరిగా ప్లాన్‌ చేసుకోలేక కొందరు.. ప్రయాణ ఛార్జీల కారణంగా మరికొందరు ముందుకు వెళ్లలేరు. అయితే ఇలాంటి వారి కోసమే ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) ఓ ప్యాకేజీని తీసుకొచ్చింది. మరి టూర్​ ఎలా సాగుతుంది? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? ధర ఎంత? వంటి వివరాల కోసం ఈ స్టోరీపై ఓ లుక్కేయండి మరి..

ట్రెజర్స్​ ఆఫ్​ తమిళనాడు(Treasures of Tamil Nadu) పేరుతో ఐఆర్​సీటీసీ ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది. హైదరాబాద్​ నుంచి ఫ్లైట్​ జర్నీ ద్వారా ఈ ప్యాకేజీని ఆపరేట్​ చేస్తున్నారు. ఈ టూర్​ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగనుంది. ఈ టూర్​లో తమిళనాడులోని కుంభకోణం, రామేశ్వరం, మధురై, తంజావూరు వంటి ప్రముఖ ప్రాంతాలు, దేవాలయాలను సందర్శించవచ్చు.

అటు శ్రీశైల మల్లన్న - ఇటు యాదాద్రి నరసింహ​ - తక్కువ ధరకే IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ! పైగా ఈ ప్లేస్​లు కూడా!

ప్రయాణ వివరాలు చూస్తే..

  • మొదటి రోజు హైదరాబాద్​ విమానాశ్రయం నుంచి ఫ్లైట్ (6E 2073) జర్నీ స్టార్ట్​ అవుతుంది. సాయంత్రానికి తిరుచ్చి విమానాశ్రయం చేరుకోగా అక్కడి నుంచి పికప్​ చేసుకుని ముందుగానే బుక్​ చేసిన హోటల్​కు తీసుకెళ్తారు. ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు.
  • రెండో రోజు బ్రేక్​ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్​ అయ్యి శ్రీరంగం ఆలయాన్ని, జంబుకేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. మధ్యాహ్నం తంజావూరుకు వెళ్తారు. అక్కడ బృహదీశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కుంభకోణంకి బయలుదేరి వెళ్లి.. అక్కడ ఐరావతేశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రికి కుంభకోణంలోని హోటల్​లో స్టే చేస్తారు.
  • మూడో రోజు హోటల్‌లో బ్రేక్​ఫాస్ట్ అనంతరం చిదంబరానికి బయలుదేరుతారు. అక్కడ నటరాజ స్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత గంగైకొండ చోళపురం వెళ్తారు. మధ్యాహ్నం తిరిగి కుంభకోణం చేరుకుంటారు. భోజనం అనంతరం కుంభకోణంలోని స్థానిక ఆలయాలను(కాశీ విశ్వనాథర్, సారంగపాణి, ఆది కుంభేశ్వర ఆలయం) సందర్శిస్తారు. రాత్రికి కుంభకోణంలోనే బస ఉంటుంది.

IRCTC అద్దిరిపోయే ప్యాకేజీ - తక్కువ ధరకే రెండు జ్యోతిర్లింగాలు, ప్రముఖ ఆలయాల దర్శనం!

  • నాలుగో రోజు హోటల్‌లో బ్రేక్​ఫాస్ట్ చేసి చెక్ అవుట్ చేస్తారు. ఆ తర్వాత రామేశ్వరం వెళ్తారు. మధ్యాహ్నానికి రామేశ్వరం చేరుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ చేస్తారు. ఆ తర్వాత రామనాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. రాత్రి రామేశ్వరంలో బస చేస్తారు.
  • ఐదో రోజు ఉదయాన్నే దనుష్కోడిని సందర్శిస్తారు. అనంతరం హోటల్‌లో బ్రేక్ ఫాస్ట్ ఉంటుంది. అబ్దుల్ కలాం మెమోరియల్‌ని సందర్శిస్తారు. ఆ తర్వాత మధురైకి బయలుదేరి వెళ్తారు. రాత్రికి మధురైలో బస చేస్తారు.
  • ఆరో రోజు హోటల్‌లో బ్రేక్​ఫాస్ట్ చేసిన తర్వాత మీనాక్షి అమ్మవారి దర్శనానికి వెళ్తారు. దర్శనం అనంతరం మధ్యాహ్నం మధురై ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఫ్లైట్​లో సాయంత్రానికి హైదరాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్​ ముగుస్తుంది.

ధరలు చూస్తే..

  • కంఫర్ట్​లో సింగిల్​ ఆక్యూపెన్సీకి రూ, 39,850, డబుల్​ ఆక్యూపెన్సీకి రూ.30,500, ట్రిపుల్​ ఆక్యూపెన్సీకి రూ.26,800గా నిర్ణయించారు.
  • ఇక 5 నుంచి 11 సంవత్సరాల పిల్లలకు విత్​ బెడ్​ రూ.26,800, విత్​ అవుట్​ బెడ్​ రూ.22,600గా నిర్ణయించారు.
  • ప్రస్తుతం ఈ టూర్​ ఆగష్టు 13న అందుబాటులో ఉంది.
  • ఈ టూర్​కు సంబంధించిన పూర్తి వివరాలు, ప్యాకేజీ బుకింగ్​ కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి.

అటు భగవత్​ దర్శనాలు - ఇటు బీచ్​లో సరదాలు - సముద్ర తీరానికి IRCTC అద్దిరిపోయే టూర్ ప్యాకేజీ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.