4:20PM
లోక్‌సభ ఎన్నికల పూర్తి షెడ్యూల్ ఇదే
- మొత్తం ఏడు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు
- ఏప్రిల్ 19, 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1న పోలింగ్
- 22 రాష్ట్రాల్లో ఒకే విడతలో లోక్‌సభ ఎన్నికలు
- నాలుగు రాష్ట్రాల్లో రెండు విడతల్లో ఎన్నికలు
- కర్ణాటక, రాజస్థాన్, త్రిపుర, మణిపుర్‌లో రెండు విడతల్లో ఎన్నికలు
- ఛత్తీస్‌గఢ్, అసోంలో మూడు విడతల్లో ఎన్నికలు
- ఒడిశా, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్‌లో నాలుగు విడతల్లో ఎన్నికలు
- మహారాష్ట్ర, జమ్మూకశ్మీర్‌లో ఐదు విడతల్లో ఎన్నికలు
- యూపీ, బిహార్, బంగాల్‌లో ఏడు విడతల్లో ఎన్నికలు
తొలి దశ
- నోటిఫికేషన్: 20 మార్చి, 2024
- నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: 27 మార్చి
- నామినేషన్ల పరిశీలన: 28 మార్చి
- ఉపసంహరణకు ఆఖరు తేదీ: 30 మార్చి
- పోలింగ్ తేదీ: ఏప్రిల్ 19
రెండో విడత
- నోటిఫికేషన్: 28 మార్చి, 2024
- నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 04
- నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 5వ తేదీ
- ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 8
- పోలింగ్ తేదీ: ఏప్రిల్ 26
- మూడో దశ
- నోటిఫికేషన్: ఏప్రిల్ 12, 2024
- నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 19
- నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 20
- ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 22
- పోలింగ్ తేదీ: మే 7
నాలుగో విడత
- నోటిఫికేషన్: ఏప్రిల్ 18, 2024
- నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: ఏప్రిల్ 25
- నామినేషన్ల పరిశీలన: ఏప్రిల్ 26
- ఉపసంహరణకు ఆఖరు తేదీ: ఏప్రిల్ 29
- పోలింగ్ తేదీ: మే 13
ఐదో విడత
- నోటిఫికేషన్: ఏప్రిల్ 26, 2024
- నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 3
- నామినేషన్ల పరిశీలన: మే 4
- ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 6
- పోలింగ్ తేదీ: మే 20
ఆరో విడత
- నోటిఫికేషన్: ఏప్రిల్ 29, 2024
- నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 6
- నామినేషన్ల పరిశీలన: మే 7
- ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 9
- పోలింగ్ తేదీ: మే 25
ఏడో విడత
- నోటిఫికేషన్: మే 7, 2024
- నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ: మే 14
- నామినేషన్ల పరిశీలన: మే 15
- ఉపసంహరణకు ఆఖరు తేదీ: మే 17
- పోలింగ్ తేదీ: జూన్ 1
3:50PM
దేశంలో సార్వత్రిక ఎన్నికలకు నగారా మోగింది. విజ్ఞాన్‌భవన్ ప్లీనరీ హాల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం(ECI) ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. మొత్తం 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫేజ్- 1లోనే ఏపీ, తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ షెడ్యూల్
- ఆంధ్రప్రదేశ్‌లో మే 13న అసెంబ్లీ ఎన్నికలు
- జూన్ 4న ఓట్ల లెక్కింపు
- ఏప్రిల్ 18న ఎన్నికల నోటిఫికేషన్
- ఏప్రిల్ 25న నామినేషన్ల స్వీకరణకు తుదిగడువు
- ఏప్రిల్ 26న నామినేషన్లు పరిశీలన
- ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ గడువు
3:39PM
- పోలింగ్ రోజు నిరంతరం సమాచారం తెలుసుకుంటాం: సీఈసీ
- సోషల్ మీడియా, వెబ్ కాస్టింగ్, 1950, గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా సమాచార సేకరణ: సీఈసీ
- ఐదు మాధ్యమాల పర్యవేక్షణకు జిల్లాస్థాయి అధికారి ఉంటారు: సీఈసీ
- రాష్ట్రాల మధ్య అనధికార వస్తువులు, డబ్బు రవాణా జరగకుండా నిఘా: సీఈసీ
- అంతర్జాతీయ సరిహద్దుల్లోనూ డ్రోన్ల సాయంతో నిఘా ఉంటుంది: సీఈసీ
3:32PM
- పోటీచేస్తున్న అభ్యర్థుల పూర్తి వివరాలు కేవైసీ యాప్‌లో చూడవచ్చు: సీఈసీ
- అభ్యర్థి పూర్తి వివరాలను ప్రతి ఓటరూ తెలుసుకోవచ్చు: సీఈసీ
- అభ్యర్థిపై ఉన్న క్రిమినల్ కేసులు, ఆస్తులు, అప్పుల వివరాలు యాప్‌లో ఉంటాయి: సీఈసీ
- తాయిలాలు, నగదు పంపిణీ జరిగితే ఫొటో తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయండి: సీఈసీ
- మీ సెల్‌ఫోన్ లోకేషన్‌ను బట్టి మీ ప్రాంతానికి వంద నిమిషాల్లో చేరుకుంటాం: సీఈసీ
- ధనబలం,కండబలం నియంత్రణ మా ముందున్న అతిపెద్దసవాలు: సీఈసీ
- ప్రచారం,పోలింగ్, అవాంఛనీయఘటనల నియంత్రణ బాధ్యత మాపైఉంది: సీఈసీ
3:27PM
- యువత కొత్త ఓటర్లే కాదు, వారు చాలా ప్రభావశీలురు: ఈసీ
- ఒక యువతి లేదా యువకుడు మరో పది మందితో ఓటు వేయిస్తాడు: ఈసీ
- యువత చైతన్యవంతమై ఓటింగ్ శాతం పెంచేందుకు కృషిచేయాలి: ఈసీ
3:23PM
- ఎలాంటి లోపం లేకుండా ఎన్నికలు జరపాలనేదే ఈసీ ప్రయత్నం: ఈసీ
- ఓటరు జాబితా రూపొందిచడంలో ఎంతో శ్రమించాం : ఈసీ
- సిబ్బందితో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకున్నాం : ఈసీ
- మొత్తం ఓటర్లు 96.8 కోట్లు : ఈసీ
- పురుషులు 49.7 కోట్లమంది, 47.1 మహిళా ఓటర్లు : ఈసీ
- తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న 1.85 కోట్లమంది: ఈసీ
- 48 వేలమంది ట్రాన్స్‌జెండర్లు: ఈసీ
- 88.4 లక్షల మంది దివ్యాంగులు: ఈసీ
- దేశవ్యాప్తంగా ప్రతి వెయ్యిమంది పురుషులకు 948 మంది స్త్రీలు: ఈసీ
- 12 రాష్ట్రాల్లో పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువ మంది ఉన్నారు: ఈసీ
- ప్రతి వెయ్యిమంది పురుషులకు వెయ్యికి పైగా ఉన్న రాష్ట్రాలు 12: ఈసీ
- ఎన్నికల్లో స్త్రీలు కూడా పెద్దసంఖ్యలో పాల్గొనడం ప్రజాస్వామ్యానికి బలమైన పునాది: ఈసీ
- 55 లక్షల ఈవీంఎంల: ఈసీ
- 10.5 లక్షల పోలింగ్ కేంద్రాలు: ఈసీ
- 1.5 లక్షల పోలింగ్ అధికారులు, భద్రతా సిబ్బంది: ఈసీ
3:15PM
- అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత్‌లో ఎన్నికలకు సౌకర్యాల కల్పన పెద్ద సవాలు: ఈసీ
- దేశవ్యాప్తంగా 97 కోట్ల మంది ఓటు వేసేలా ఏర్పాట్లు చేశాం: ఈసీ
- ఈ ఎన్నికల్లో 55 లక్షల ఈవీఎంలు వినియోగిస్తాం: ఈసీ
- సార్వత్రిక ఎన్నికల్లో 1.25 కోట్ల మంది సిబ్బంది పాల్గొననున్నారు: ఈసీ
- 3:11PM
దేశపౌరులంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఈసీ విజ్ఞప్తి చేసింది
- 2024లో ప్రపంచవ్యాప్తంగా అనేకచోట్ల ఎన్నికలు జరుగుతున్నాయి: ఈసీ
- 2024 ప్రపంచవ్యాప్తంగా ఎన్నికల సంవత్సరంగా చెప్పుకోవచ్చు: ఈసీ
- ప్రపంచమంతా భారత ఎన్నికల వైపు చూస్తోంది: ఈసీ
- భారత ప్రజాస్వామ్యబద్ధమైన ఎన్నికలను ప్రపంచం గమనిస్తోంది: ఈసీ
- స్వచ్ఛమైన ప్రజాస్వామ్యం నెలకొన్న భారతదేశం ఎలా ఓటు చేస్తుందన్నది ప్రపంచం గమనిస్తోంది: ఈసీ
- 3:06PM
విజ్ఞాన్‌భవన్ ప్లీనరీ హాల్‌లో కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్, సుఖ్‌బీర్ సింగ్ సంధులతో కలిసి లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటిస్తున్నారు. 18వ లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను వెల్లడిస్తున్నారు.
- 2:49PM
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించేందుకు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తన నివాసం నుంచి కార్యాలయానికి బయలుదేరారు.
General Election 2024 Notification : దేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పండుగకు మరికాసేపట్లో నగారా మోగనుంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల కానుంది. విజ్ఞాన్‌భవన్‌లో జరిగే విలేకర్ల సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్, మిగిలిన ఇద్దరు కమిషనర్లు జ్ఞానేశ్‌కుమార్, సుబ్బీర్‌సింగ్ సంధుతో కలిసి 18వ లోక్‌సభతోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్‌ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించనున్నారు.
వెంటనే ఎన్నికల కోడ్ అమలు!
సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే, దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన పత్రికా ప్రకటనను ఎన్నికల సంఘం శుక్రవారం మధ్యాహ్నమే విడుదల చేసింది. కేంద్రపాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్ శాసనసభకు ఎన్నికల తేదీలు ప్రకటిస్తారా? లేదా? అనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.
ఈ సారి ఎన్ని దశల్లో పోలింగ్ జరుగుతుందో?
2004లో 4, 2009లో 5, 2014లో 9, 2019లో 7 దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. మరి ఈసారి ఎన్ని దశల్లో ఎన్నికలు నిర్వహిస్తారో చూడాలి. 2019 ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న విడుదలకాగా, ఈసారి 6 రోజులు ఆలస్యంగా విడుదలవుతోంది. అందువల్ల షెడ్యూల్ విడుదల, పోలింగ్ తేదీల మధ్య కూడా తేడా ఉండే అవకాశం ఉంది. గత ఎన్నికల విషయానికి వస్తే, ఏప్రిల్ 11న తొలిదశ మొదలుకాగా, మే 19న చివరి దశ ముగిసింది. మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది.