ETV Bharat / bharat

'మిస్టర్ సూర్య'గా మారిన మిస్ అనసూయ- రికార్డుల్లో జెండర్ మార్చుకున్న IRS- చరిత్రలో తొలిసారి - IRS Officer Name And Gender Change - IRS OFFICER NAME AND GENDER CHANGE

IRS Officer Changes Gender : చెన్నైకు చెందిన ఓ ఐఆర్‌ఎస్‌ అధికారిక రికార్డుల్లో తన పేరు, జెండర్​ను మార్పించుకున్నారు. జెండర్​ను ఓ ఆఫీసర్ మార్చుకోవడం సివిల్‌ సర్వీసెస్‌ చరిత్రలో ఇదే మొదటిసారి కావడం గమనార్హం.

IRS Officer Changes Gender
IRS Officer Changes Gender (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 1:59 PM IST

IRS Officer Changes Gender : దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఓ ఐఆర్‌ఎస్‌ ఆఫీసర్ ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో తన జెండర్, పేరును మార్పించుకున్నారు. పుట్టుకతో మహిళగా పరిగణించిన తనను ఇకపై పురుషుడిగా గుర్తించాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖను అభ్యర్థించారు. దీంతో అన్ని అధికారిక రికార్డుల్లో మార్పులు చేసి ఇకపై ఆమెను పురుషుడిగా పరిగణిస్తున్నామని ఆర్థిక మంత్రిత్వశాఖ తెలిపింది.

అనసూయ టు అనుకతిర్‌ సూర్య
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, చెన్నెకి చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి అనసూయ ప్రస్తుతం హైదరాబాద్‌లోని కస్టమ్స్ ఎక్సైజ్ అండ్‌ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్- CESTAT చీఫ్ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆమె తన పేరును అనుకతిర్‌ సూర్యగా, జెండర్​ను మహిళకు బదులుగా పురుషుడిగా మార్చాలని ఆర్థిక మంత్రిత్వశాఖను కోరారు.

ఇకపై ఆమెను పురుషుడిగానే!
దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. "ఇటీవల మాకు ఓ విన్నపం అందింది. 2013 బ్యాచ్​కు చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారిణి అనసూయ ప్రస్తుతం హైదరాబాద్‌లోని CESTAT చీఫ్ కమిషనర్ (AR) కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె తనకు సంబంధించిన అన్ని ప్రభుత్వ అధికారిక రికార్డుల్లో తన పేరును, జెండర్​ను మార్చాల్సిందిగా అభ్యర్థించారు. అన్ని అధికారిక రికార్డుల్లో మార్పులు చేసి ఇకపై ఆమెను పురుషుడిగా పరిగణిస్తున్నాం" అని స్పష్టం చేసింది.

చెన్నైకి చెందిన ఐఆర్‌ఎస్‌ అధికారి అనసూయ చెన్నైలోని మద్రాస్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశారు. 2013లో చెన్నెలో అసిస్టెంట్‌ కమిషనర్‌గా తన వృత్తిని ప్రారంభించిన ఐఆర్‌ఎస్‌ అధికారి అనసూయ 2018లో డిప్యూటీ కమిషనర్ ర్యాంక్‌కు పదోన్నతి పొందారు. 2023లో భోపాల్‌లోని నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ నుంచి సైబర్ లా అండ్ సైబర్ ఫోరెన్సిక్స్‌లో పీజీ డిప్లొమా చేశారు. గత ఏడాది హైదరాబాద్‌లోని కస్టమ్స్ ఎక్సైజ్ అండ్‌ సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ (CESTAT) చీఫ్ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్‌గా విధుల్లో చేరారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.