Encounter In Dantewada :తెలంగాణ- ఛత్తీస్గఢ్ సరిహద్దు అటవీ ప్రాంతంలో మరోసారి కాల్పుల మోతమోగింది. దంతెవాడ జిల్లాలో మావోయిస్టులకు భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. కాల్పులు జరిగిన ప్రదేశంలో మావోలకు సంబంధించిన సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
దంతెవాడలో ఎన్కౌంటర్ - ఓ మావోయిస్టు మృతి
Published : Aug 11, 2024, 7:52 PM IST
Encounter In Dantewada (ETV Bharat)
మావోయిస్టుల నిర్మూలన కోసం భద్రతా బలగాలు ప్రతిరోజూ అడవులలో కూంబింగ్ నిర్వహిస్తుండగా వారిని హతమార్చడానికి మావోలు అనేక పన్నాగాలు పన్నుతున్నారు. కొద్ది రోజుల క్రితమే ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలోని అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు.