How Many Eggs Are Healthy In A Day : తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలను అందించే ఆహారం ఏదైనా ఉందంటే అది కోడిగుడ్డే. వెజ్ టేరియన్, నాన్ వెజ్ టేరియన్ లాగా ఇప్పుడు ఎగ్టేరియన్ అనే పదం వాడుకలోకి వస్తుంది. ప్రతిరోజు ఒక్క కోడిగడ్డు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది అని పెద్దలు, నిపుణులు చెబుతుంటారు. ఇప్పటికీ గుడ్డు వెజ్ టేరియనా? నాన్ వెజా అనే విషయంలో పలు సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గుడ్డు వినియోగంపై వైద్యులు ఏం చెబుతున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గుడ్డు మనకు అవసరమైన ప్రొటీన్లను అందించడమే కాకుండా, శరీరాన్ని అనేక వ్యాధుల నుంచి కాపాడేందుకు సహాయకారిగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యవంతమైన వ్యక్తి ప్రతిరోజూ ఒక్క పూర్తి గుడ్డును తీసుకోవచ్చు. వారానికి 7 నుంచి 10 గుడ్లు తీసుకోవచ్చని న్యూట్రిషన్లు సలహా ఇస్తున్నారు. వ్యాయామం చేసేవారికి, అథ్లెట్లకు ప్రొటీన్లు ఎక్కువగా అవసరపడతాయి. అలాంటి వారు రోజుకు నాలుగు నుంచి ఐదు గుడ్లు తినవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఇది మంచి కొలెస్ట్రాల్‌ను ప్రోత్సహిస్తుందని తెలిపారు. అయితే కొలెస్ట్రాల్ సమస్య ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు గుడ్డు తినాల్సి ఉంటుందని పేర్కొన్నారు. గుడ్డు తింటే కొలస్ట్రాల్ పెరుగుతుంది అనేది అపోహే అని న్యూట్రిషన్స్ సూచిస్తున్నారు. గుడ్డు మొత్తంగా తీసుకుంటే 13 గ్రాముల ప్రోటీన్స్ అందుతాయి. అదే గుడ్డులోని వైట్ తీసుకుంటే 6 గ్రాముల ప్రోటీన్స్ అందుతాయి. గుడ్డుపై బటర్, క్రీంలు వేయకుండా నార్మల్‌గా తీసుకోవాలి సూచిస్తున్నారు.
చర్మం, జుట్టు, గోర్ల లాంటి శరీర భాగాల ఆరోగ్యానికి కోడిగుడ్లు కీలకంగా వ్యవహరిస్తాయని వైద్యులు వెల్లడించారు. కంటిచూపు పెంచడం, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి గుడ్డు ఎంతగానో సహాయ పడుతుందని తెలిపారు. గుడ్డు ఎముకలకూ బలాన్ని ఇస్తుందని, గుండె ఆరోగ్యానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. అయితే, అధిక రక్తపోటు ఉన్నవారు మాత్రం గుడ్లుకూ దూరంగా ఉండటం మంచిదని వైద్యలు సూచిస్తున్నారు. తప్పనిసరైతే పచ్చ సొనను తనకూడదు, తెల్లసొనను మాత్రమే తినాలని పేర్కొంటున్నారు. పచ్చ సొనలో కొవ్వు శాతం కాస్త ఎక్కువగా ఉంటుంది. తెల్ల సొన నుంచి హాని తక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్నవారు తమ ఆహారంలో గుడ్డును తీసుకోవాలంటే డాక్టర్ సలహాను తీసుకొవాలని సూచిస్తున్నారు. వారానికి రెండు లేదా మూడు గుడ్లు తీసుకోవడం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని ప్రముఖ వైద్యురాలు శ్రీలత సూచించారు. కిడ్నీ ఫైయిల్ అయిన వారు కోడిగుడ్డు తీసుకుంటే మంచిదని ఆమె తెలిపారు. పిల్లల ఎదుగుదలలో గుడ్డు వినియోగం ఎంతగానో తోడ్పడుతుందని ఆమె వెల్లడించారు.
వైట్ ఎగ్.. బ్రౌన్ ఎగ్ - ఏ గుడ్డులో ఎక్కువ పోషకాలు ఉంటాయో మీకు తెలుసా? - Brown Vs White Eggs