Johnny Master Controversy : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై జనసేన పార్టీ చర్యలు తీసుకుంది. ఇకపై జనసేన పార్టీ కార్యక్రమాలకు షేక్ జానీ దూరంగా ఉండాలని ఆ పార్టీ కాన్ఫిక్ట్ మేనేజ్మెంట్ హెడ్ వేములపాటి అజయ్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని తెలిపారు.
నార్సింగి పోలీస్ స్టేషన్లో జానీ మాస్టర్‌పై కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అజయ్ కుమార్ వెల్లడించారు. జనసేన పార్టీలో క్రియాశీలక కార్యకర్తగా ఉన్న జానీ మాస్టర్, 2023లో జరిగిన ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌కు మద్దతుగా పిఠాపురంలో జోరుగా ప్రచారం నిర్వహించారు. పవన్ కల్యాణ్‌కు వీరాభిమాని అయిన జానీ మాస్టర్, ఆయన సినిమాలకు కొరియోగ్రఫీ కూడా చేశాడు.