ETV Bharat / international

మరో కీలక పదవి రేసులో భారతీయుడు- జై భట్టాచార్య వైపు ట్రంప్‌ మొగ్గు! - DONALD TRUMP CABINET

అమెరికాలో మరో కీలక పదవి రేసులో భారతీయుడు జై భట్టాచార్య- ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హెల్త్‌ (ఎన్ఐ​హెచ్​) నూతన డైరెక్టర్‌గా నియమించేందుకు ట్రంప్ ఆసక్తి

Donald Trump
Donald Trump (Associated Press)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 24, 2024, 12:23 PM IST

US NIH New Director : అమెరికాలో వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ హెల్త్‌ (ఎన్ఐ​హెచ్​) నూతన డైరెక్టర్‌గా భారతీయ మూలాలున్న జై భట్టాచార్యను నియమించాలని ట్రంప్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆంగ్ల పత్రిక వాషింగ్టన్‌ పోస్టు కథనంలో పేర్కొంది. రేసులో మొత్తం ముగ్గురు వ్యక్తులు ఉండగా, జై వైపు ట్రంప్‌ ఆసక్తి చూపుతున్నట్లుగా తెలిపింది.

జై భట్టాచార్య స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయంలో ఫిజీషియన్‌, ఆర్థికవేత్తగా శిక్షణ పొందారు. ట్రంప్‌ క్యాబినెట్​లో ఆరోగ్య మంత్రిగా ఎంపికైన రాబర్ట్‌ ఎఫ్‌ కెన్నడీని జై భట్టాచార్య గత వారమే కలిశారు. ఎన్‌ఐహెచ్‌పై తన ఆలోచనలను కెన్నడీతో పంచుకున్నారు. దీనికి ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. దాదాపు 50 బిలియన్‌ డాలర్ల విలువైన ఈ సంస్థ అమెరికా బయోమెడికల్‌ రీసెర్చిని పర్యవేక్షిస్తుంది. ఇతర ఏజెన్సీలతో కలిసి ఇది అమెరికా వైద్య విభాగం కింద పనిచేస్తుంది. ఇక ట్రంప్‌ ప్రభుత్వం అమెరికాలో సంస్కరణలు తీసుకురావడంపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలోనే భట్టాచార్య సరికొత్త సృజనాత్మక అంశాలపై ఎన్‌ఐహెచ్‌ దృష్టి సారించాలని వాదిస్తున్నారు. ఎప్పటి నుంచో ఆ సంస్థలో పాతుకుపోయిన వారి పట్టు తొలగించాలని చెబుతున్నారు.

కెన్నడీ సార్థ్యంలో హెచ్‌హెచ్‌ఎస్ ట్రంప్‌ కార్యవర్గానికి అత్యంత కీలకమైంది. ఇది అమెరికాలో వైద్య సేవలను చూసుకోవాల్సి బాధ్యత ఉంటుంది. నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ఎకనామిక్‌ రీసెర్చిలో జై అసోసియేట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఇక స్టాన్‌ఫోర్డ్‌లో ప్రస్తుతం ప్రొఫెసర్‌గా కూడా పనిచేస్తున్నారు. సెంటర్‌ ఫర్‌ డెమోగ్రఫీ అండ్‌ ఎకనామిక్‌ ఆఫ్‌ హెల్త్‌ అండ్‌ ఏజినింగ్‌ డైరెక్టర్‌గానూ జై భట్టాచార్య ఉన్నారు.

ఆర్థికమంత్రిగా స్కాట్‌ బెసెంట్‌
ట్రంప్ వివిధ కీలక శాఖలకు శుక్రవారం కొత్త అధిపతులను నామినేట్ చేశారు. అంతర్జాతీయ మదుపరి స్కాట్‌ బెసెంట్‌ను ఆర్థిక మంత్రిగా ట్రంప్‌ నామినేట్‌ చేశారు. మన మహత్తర దేశ 250వ వార్షికోత్సవ సందర్బంగా స్కాట్‌ అమెరికన్‌ స్వర్ణయుగాన్ని తీసుకురావడంలో తోడ్పడతారని పేర్కొన్నారు. పెట్టుబడులకు గమ్యస్థానంగా, నవీకరణకు చిరునామాగా, అమెరికన్‌ డాలర్‌ను ప్రపంచానికి రిజర్వు కరెన్సీగా కొనసాగించడానికీ స్కాట్‌ కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. కార్మిక మంత్రి పదవికి తాను నామినేట్‌ చేసిన లోరీ చావెజ్‌ డిరెమెర్‌కు వ్యాపారులు, కార్మికుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుందనీ, అన్ని వర్గాలూ కలసి అమెరికాను సుసంపన్నంగా, బలీయంగా తీర్చిదిద్దుతాయని ఆయన తెలిపారు. వ్యాధుల అదుపు, నివారణ కేంద్రం (సీడీసీ) డైరెక్టర్‌గా డాక్టర్‌ డేవ్‌ వెల్డన్‌నూ, ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌.డి.ఎ.) డైరెక్టర్‌గా మార్టీ మెకారీనీ నామినేట్‌ చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.