ETV Bharat / technology

వాట్సాప్​లో కొత్త ఫీచర్- ఇకపై వాయిస్ మెసెజ్​ను టెక్స్ట్​ రూపంలో చదువుకోండిలా!

వాట్సాప్​లో 'వాయిస్‌ మెసేజ్‌ ట్రాన్స్‌స్క్రిప్ట్‌' ఫీచర్- దీన్ని ఎలా ఉపయోగించాలంటే..?

Whatsapp Introduces Voice Message Transcripts
Whatsapp Introduces Voice Message Transcripts (Whatsapp Blog)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 24, 2024, 12:40 PM IST

Whatsapp Voice Message Transcripts: ప్రస్తుతం ప్రముఖ ఇన్​స్టంట్ మెసెజింగ్ యాప్ వాట్సాప్​ మన నిత్య జీవితంలో ఒక భాగం అయిపోయింది. వాట్సాప్ ​లేని స్మార్ట్​ఫోనే​ లేదంటే అతిశయోక్తి కాదు. దీనికి కారణం ఇది ఈజీగా, స్పీడ్​గా మెసేజెస్​ పంపించేదుకు, స్వీకరించడానికి వీలుగా ఉండటమే. అంతేకాక వాట్సాప్​ ఎప్పటికప్పుడు తన యూజర్ల కోసం కొంగొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకురావడం కూడా మరో కారణంగా చెప్పొచ్చు.

ఈ క్రమంలో తాజాగా తన యూజర్లను ఆకట్టుకునేందుకు వాట్సాప్​ మరో సరికొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. సాధారణంగా మనకి ఎవరైనా వాట్సాప్​లో మెసేజెస్ పంపిస్తే వాటిని ఓపెన్ చేయడంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. నలుగురిలో ఉన్నప్పుడు వాటిని ఓపెన్ చేయడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. దీంతో ఈ సమస్యపై వాట్సాప్ ఫోకస్ చేసింది. ఈ క్రమంలో 'వాయిస్ మెసెజ్ ట్రాన్స్​స్క్రిప్ట్' పేరుతో ఇంట్రస్టింగ్ ఫీచర్​ను తీసుకొచ్చింది.

వాట్సాప్ తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్​ సాయంతో వినియోగదారులు ఇకపై వాయిస్ మెసెజ్​లను టెక్స్ట్​ రూపంలో మార్చుకుని చదువుకోవచ్చు. అలాగని ఇది ట్రాన్స్‌లేటర్‌ కాదు. కేవలం ఏ భాషలో ఉంటుందో ఆ లాంగ్వేజ్​కు అక్షర రూపాన్ని మాత్రమే ఇస్తుంది. అయితే కేవలం మెసెజ్ అందుకున్న వ్యక్తి మాత్రమే ఈ టెక్ట్స్‌ను చూడగలరని, పంపించిన వారు దీన్ని వినియోగించలేరని వాట్సాప్​ పేర్కొంది.

ఈ ఫీచర్ ఎనేబుల్ చేసుకోవడం ఎలా?:

  • ఈ కొత్త ఫీచర్​ను యాక్టివేట్‌ చేసుకునేందుకు వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
  • అనంతరం చాట్స్‌ ఆప్షన్​ను సెలెక్ట్ చేసుకుంటే అందులో 'వాయిస్‌ మెసేజ్‌ ట్రాన్స్‌స్క్రిప్ట్‌' కన్పిస్తుంది.
  • అక్కడ ఆన్‌/ఆఫ్​తో పాటు లాంగ్వేజ్ ఆప్షన్​ కూడా అందుబాటులో ఉంటుంది.
  • వాటిలో మీకు నచ్చిన లాంగ్వెజ్​ను సెలక్ట్ చేసుకోవచ్చు.
  • అయితే ఆండ్రాయిడ్‌ మొబైల్స్​లో ఈ ఫీచర్​ ఇంగ్లిష్‌, పోర్చుగీస్‌, రష్యన్‌, స్పానిష్‌ భాషలకు మాత్రమే సపోర్ట్‌ చేస్తుంది.
  • ఐఓఎస్ యూజర్లకు మాత్రం అదనంగా అరబిక్‌, చైనీస్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇటాలియన్‌, జపనీస్‌ వంటి భాషల్లో దీన్ని అందుబాటులోకి తెచ్చారు.
  • మున్ముందు ఇతర భాషలకూ విస్తరించే అవకాశం ఉంది.
  • సపోర్ట్‌ చేయని లాంగ్వేజ్, పదాలు గుర్తించిన సందర్భంలో ట్రాన్స్‌స్క్రిప్ట్‌ ఎర్రర్‌ వస్తుందని వాట్సప్‌ తన బ్లాగ్‌ పోస్టులో పేర్కొంది.
  • వాట్సాప్ గ్లోబల్‌గా ఈ ఫీచర్‌ను రోలవుట్‌ చేసింది. త్వరలో అందరికీ అందుబాటులోకి తీసుకురానుంది.

లగ్జరీ కారు కొనడం మీ కలా..? అయితే వెంటనే త్వరపడండి.. త్వరలో వాటి ధరలు పెంపు!

వివో టైమ్ ఆగయా- అడ్వాన్స్​డ్ కెమెరా, పవర్​ఫుల్ బ్యాటరీతో 'X200' సిరీస్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.