Remedies to Get Rid of Nara Dishti: నరదిష్టిని చాలా మంది నమ్ముతారు. ఇది మనిషిని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని, ఆర్థిక, ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని భావిస్తారు. ఈ కనుదిష్టిని పోగొట్టుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఫలితం శూన్యం. మీరు కూడా ఇలాంటి ఇబ్బందుల్లో ఉంటే, మీపై ఉన్న నరదిష్టి పోవాలంటే కొన్ని తాంత్రిక పరిహారాలు చేయాలని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
ఎండుమిరపకాయల పరిహారం: మంగళవారం రోజు 21 ఎండుమిరపకాయలు తీసుకుని దండలా చేసి దానిని ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. ఇలా చేస్తే ఇంటికి, ఇంట్లోని కుటుంబసభ్యులపై ఉన్న భయంకరమైన కనుదిష్టి తొలగిపోతుందని మాచిరాజు చెబుతున్నారు.
బ్రహ్మ దండి తంత్రం: తాంత్రిక శాస్త్రం ప్రకారం బ్రహ్మ దండి తంత్ర పరిహారం పాటిస్తే అన్ని దిష్టి దోషాలు పోతాయని చెబుతున్నారు. ఆ పరిహారం ఎలా పాటించాలంటే, ఆదివారం రోజున బ్రహ్మజెముడు చెట్టును ఇంటికి తీసుకురావాలి. ఆ తర్వాత దానిని ఇంట్లోని ఈశాన్య మూలలో తలకిందులగా వేలాడదీయాలి. ఆపై ప్రతి శుక్రవారమూ గుగ్గిలం పొగ వేయాలి. ఈ పరిహారం చేస్తే ఇంటి సభ్యులందరిపై ఉన్న దిష్టి మొత్తం పోతుందని అంటున్నారు.
రామ మునగ చెట్టు పరిహారం: భయంకరమైన కనుదిష్టి, ఎదుటివాళ్ల ఏడుపులతో ఇబ్బందిపడుతున్న వారు రామమునగ చెట్టు పరిహారం పాటిస్తే విశేష ఫలితాలు కలుగుతాయని చెబుతున్నారు. అందుకోసం, అమావాస్య రోజు సాయంత్రం పూట ఈ రామ మునగ చెట్టును ఇంటికి తీసుకురావాలి. ఆ మర్నాడు ఉదయం ఈ చెట్టును ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. ఇలా చేయడం వల్ల ఆ చెట్టు యజమానిని రామబాణంలా కాపాడుతుందని అంటున్నారు.
నరసింహ స్వామి పూజ: ఎదుటి వాళ్ల ఏడుపులు, నరదిష్టిని పొగొట్టే శక్తి నరసింహ స్వామికి ఉంటుందని మాచిరాజు చెబుతున్నారు. అందుకోసం ప్రతీ శనివారం నరసింహ స్వామి ఆలయంలో తులసి మాల సమర్పించి, కొబ్బరికాయ కొట్టాలి. ఆ తర్వాత ఏదైనా తీపి పదార్థం లేదా పులిహోరను నైవేద్యంగా సమర్పించి, దానిని గుడి ఆవరణలో భక్తులకు పంచిపెట్టాలి.
ఏనుగు వెంట్రుక ఉంగరం: భయంకరమైన కనుదిష్టి, ఎదుటివాళ్ల ఏడుపులతో ఇబ్బందిపడుతున్న వారు ఏనుగు వెంట్రుక ఉంగరం ధరిస్తే మంచిదని మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు.
Note : పైన తెలిపిన వివరాలు కొందరు జ్యోతిష్య నిపుణులు, శాస్త్రంలో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతేకానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకూ విశ్వసించాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
"ఈ పరిహారం చేస్తే - మీ సొంతింటి కల త్వరలోనే నెరవేరుతుంది!"
"ఏ పని చేసినా కలిసి రావట్లేదా? - హనుమంతుడి ఆలయానికి వెళ్లండి"
"భరించలేని అప్పుల బాధలా? - ఈ ఉంగరం ధరిస్తే అన్నీ తీరిపోతాయి"