Tollfree Number to Resolve Railway Passenger Issues : ప్రయాణికులు సులువుగా రైల్వే సేవలు పొందేందుకు ఆ శాఖ 139 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సౌకర్యం కల్పించి మూడేళ్లు అవుతున్నా ప్రజల్లో అవగాహన లేక పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. ప్రయాణికులు అత్యవసర సమయంలో ఎవరికి సమాచారం ఇవ్వాలో తెలీక ఇబ్బందులు పడుతున్నారు.
ప్రయాణికులు 139 నంబర్‌కు డయర్ చేయగానే కంట్రోల్ రూమ్‌కి కనెక్ట్ అవుతుంది. ఫిర్యాదు స్వీకరించగానే సమాచారం ఇచ్చిన ప్రయాణికులు ఎక్కుడున్నారనే విషయం గుర్తిస్తారు. వెంటనే ప్రయాణికులు చేరుకునే సమీప రైల్వేస్టేషన్ రక్షక కేంద్రానికి చేరువేస్తారు. అక్కడున్న సిబ్బంది స్పందించి రైల్వే స్టేషన్‌కు చేరుకోగానే ఫిర్యాదు ఇచ్చిన బోగి వద్దకు చేరుకుని సమస్య పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటారు.
స్కాన్ చేసి ఫిర్యాదు చేయొచ్చు : ప్రయాణికులకు అత్యవసర సమయంలో అందే సేవల గురించి రైల్వే అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. 139 టోల్‌ఫ్రీ నంబరు ఉపయోగాలను ప్రయాణికులకు వివరిస్తూ ప్రచారం చేయడంతో పాటు ప్రధాన రైల్వే బోగీల్లో క్యూఆర్ కోడ్ ముద్రించిన స్టిక్కర్లు అంటిస్తున్నారు. దీంతో నేరుగా ఆండ్రాయిడ్ మొబైల్‌తో యాప్‌లోకి వెళ్లి ఫిర్యాదు చేయవచ్చు. మేరుగైన సేవలు సత్వరం పొందే వీలు కల్పించారు.
ఏ సేవలు పొందవచ్చు అంటే : -
- ప్రమాదం జరిగిన సమయంలో తక్షణ సమాచారం.
- సిబ్బంది సేవల్లో లోపం.
- బోగీల్లో ప్రమాదం.
- రైల్వేల్లో సాంకేతిక లోపాలు
- రైల్వేల్లో పారిశుద్ధ్యం, సౌకర్యాలు లేకపోవడంపై ఫిర్యాదు.
- సరుకు రవాణా, పార్సిల్ సమాచారం
- అత్యవసర వైద్య సహాయం.
- ప్రయాణికుల భద్రత
- ఉద్యోగుల, సిబ్బంది పని తీరుపై ఫిర్యాదు
- కేటరింగ్ ఆహార పానీయాల కోసం
- టికెట్ రద్దు సమాచారం.
- రైల్వే స్టేషన్లలో చక్రాల కుర్చీ బుకింగ్
- ఫిర్యాదులపై తీసుకుంటున్న సమాచారం.
- చిన్నారుల సంరక్షణ
- వస్తువుల చోరీలు
"రైల్వే ప్రయాణికుల భద్రత కోసం, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సత్వర సేవల కోసం 139 టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేశారు. దీని ప్రయోజనాల గురించి ప్రయాణికులకు అవగాహన కల్పిస్తున్నాం. కంట్రోల్ రూమ్ నుంచి ఇటీవల సమాచారం రావడం పెరిగింది. వీటికి తక్షణమే స్పందించి సమస్య పరిష్కరిస్తున్నాం. కాగా ఈ సదుపాయాన్ని రాత్రి వేళలో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు." - పవన్‌కుమార్‌రెడ్డి, రైల్వే ఎస్సై, మిర్యాలగూడ
కేవలం రూ.40లతో హైటెక్ సిటీ వెళ్లొచ్చు - కానీ అదొక్కటే ప్రాబ్లమ్
ఉద్యోగులకు గుడ్ న్యూస్- LTC రూల్స్ ఛేంజ్- ఇకపై తేజస్, వందే భారత్ రైళ్లలోనూ వెళ్లే వీలు
సికింద్రాబాద్ నుంచి కుంభమేళాకు 180 ప్రత్యేక రైళ్లు - టైమింగ్స్ తెలుసా?