ETV Bharat / offbeat

బరువు తగ్గించే "జొన్న గుమ్మడికాయ సూప్" - ప్రిపరేషన్ చాలా ఈజీ! - బీపీ, షుగర్​కూ చక్కటి మెడిసిన్! - HEALTHY JOWAR PUMPKIN SOUP

ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సూపర్ సూప్ - ఇలా చేసుకుంటే టేస్ట్ అదుర్స్!

Jowar Pumpkin Soup Recipe
Jowar Pumpkin Soup (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Nov 24, 2024, 12:41 PM IST

Jowar Pumpkin Soup Recipe in Telugu : ప్రస్తుత రోజుల్లో బరువు తగ్గే క్రమంలో చాలా మంది డైటింగ్ చేయడం మామూలే. అయితే ఇలా నోరు కట్టేసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవ్వడమేమో గానీ లేనిపోని ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్ లేకపోలేదు. కాబట్టి, శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతూ బరువు తగ్గాలనుకునేవారికోసం ఒక అద్దిరిపోయే సూప్ రెసిపీ తీసుకొచ్చాం. అదే.. "జొన్న గుమ్మడికాయ సూప్". పైగా చలికాలం కాబట్టి ఈ సూప్​ని డైట్​లో భాగం చేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. కేవలం బరువు తగ్గాలనుకునేవారికే కాదు.. షుగర్, బీపీ, పీసీఓడీ నియంత్రణలో ఉండాలనుకునేవారికీ ఇదొక బెస్ట్ ఆప్షన్​గా చెప్పుకోవచ్చు! మరి, ఇంకెందుకు ఆలస్యం ఈ హెల్దీ అండ్ టేస్టీ సూపర్ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.

కావాల్సిన పదార్థాలు :

  • జొన్నపిండి - 3 టేబుల్​స్పూన్లు
  • తీపి గుమ్మడి ముక్కలు - 350 నుంచి 400 గ్రాములు
  • ఉల్లిపాయ - 1
  • పుదీనా ఆకులు - అరకప్పు
  • హిమాలయన్ సాల్ట్ - కొద్దిగా
  • మిరియాల పొడి - ఒకటిన్నర టేబుల్​స్పూన్లు
  • నెయ్యి - ఒకటిన్నర టేబుల్​స్పూన్లు
  • జీలకర్ర - అరటేబుల్​స్పూన్
  • వాము - కొద్దిగా
  • వెల్లుల్లి రెబ్బలు - 4
  • నిమ్మకాయ - 1
  • కొత్తిమీర తరుగు - కొద్దిగా

తయారీ విధానం :

  • ఇందుకోసం ముందుగా స్టౌపై కడాయి పెట్టుకొని జొన్నపిండిని లో ఫ్లేమ్​ మీద మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకొని పక్కనుంచుకోవాలి.
  • ఇప్పుడు స్టౌ మీద మరో పాన్ పెట్టుకొని 750 - 800ఎంఎల్ వాటర్ పోసుకొని మరిగించుకోవాలి. నీళ్లు వేడెక్కి మరుగుతున్నప్పుడు అందులో మీడియం సైజ్​లో కట్ చేసుకున్న తీపి గుమ్మడి ముక్కలు, కాస్త పెద్దగా తరుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా ఉడికించుకోవాలి. అందుకోసం పావు గంట సమయం పట్టొచ్చు. అయితే, ఒకవేళ మీకు తీపి గుమ్మడి ఇష్టం లేకపోతే బూడిద గుమ్మడిని వాడుకోవచ్చు.
  • ఆవిధంగా ఉడికించుకున్నాక పుదీనా ఆకులు వేసి కలిపి మరో మూడు నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత స్టెయినర్ సహాయంతో ఆ వాటర్​ని ఒక బౌల్​లోకి వడకట్టుకోవాలి.
  • ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో స్టెయినర్​లో ఉన్న వడకట్టుకున్న గుమ్మడి, ఉల్లి, పుదీనా ఆకుల మిశ్రమాన్ని వేసుకోవాలి. ఆపై ముందుగా వేయించుకున్న జొన్నపిండిని కూడా యాడ్ చేసుకొని గుమ్మడి ముక్కల మిశ్రమాన్ని ఉడికించుకున్న వాటర్​ని కొద్దిగా పోసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోవాలి.
  • అనంతరం స్టౌపై కడాయి పెట్టుకొని వడకట్టుకున్న గుమ్మడి ముక్కలు ఉడికించిన వాటర్​ని పోసుకోవాలి. ఆపై అందులో మీరు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని కలుపుతూ కొద్దికొద్దిగా యాడ్ చేసుకోవాలి.
  • ఆ తర్వాత మీడియం ఫ్లేమ్ మీద మిశ్రమం చిక్కగా మారేంత వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికించుకునేటప్పుడే అందులో రుచికి సరిపడా హిమాలయన్ సాల్ట్, మిరియాల పొడి వేసుకొని కలిపి ఉడికించాలి. సూప్ రెండు, మూడు పొంగులు రాగానే మంటను లో ఫ్లేమ్​లోకి టర్న్ చేసుకొని మరిగించుకోవాలి.
  • ఇప్పుడు ఇంకో బర్నర్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. అది కరిగి కాస్త వేడయ్యాక జీలకర్ర వేసి చిట్లనివ్వాలి. ఆపై వాము వేసి 5 సెకన్లు వేయించుకోవాలి.
  • ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి తరుగు వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేపుకొని స్టౌ ఆఫ్ చేసుకోవాలి.
  • అనంతరం దాన్ని మరో బర్నర్​ మీద మరిగించుకుంటున్న సూప్​లో పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి.
  • ఇక చివరగా కొద్దిగా కొత్తిమీర తరుగు చల్లుకొని, నిమ్మరసం పిండుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలు. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే "జొన్న గుమ్మడికాయ సూప్" రెడీ!

ఇవీ చదవండి :

టేస్టీ అండ్​ హెల్దీ "బీట్​రూట్​ సూప్‌"- ఇలా చేస్తే నిమిషాల్లోనే కమ్మటి రుచి!

ఈ చలిలో మటన్ పాయా.. సూప్ జుర్రేస్తే జిందగీ ఖుష్ అవ్వాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.