ETV Bharat / entertainment

డ్యాన్స్​తో అదరగొడుతున్న కొత్త భామలు - టాలీవుడ్​లో వీరికే ఫుల్ డిమాండ్! - Tollywood Dancer Heroines - TOLLYWOOD DANCER HEROINES

Tollywood Dancer Heroines : ఇండియన్ సినిమాల్లో సాంగ్సే పెద్ద ఆకర్షణ. ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకట్టుకునేందుకు పాటలను భారీ హంగులతో తెరకెక్కిస్తుంటారు. దీంతో డ్యాన్సుల్లో హుషారెత్తించే భామలకు భారీగా డిమాండ్‌ పెరిగిపోయింది. మరి నవతరం భామల్లో డ్యాన్స్​లో ప్రతిభను చూపిస్తూ అవకాశాలను అందుకుంటున్న భామలెవరో తెలుసుకుందాం.

ETV Bharat
Kritshetty Sreeleela Rashmika (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 17, 2024, 10:24 AM IST

Tollywood Dancer Heroines : అందం, నటన - చిత్ర పరిశ్రమలో హీరోయిన్‌గా రాణించడానికి ఈ రెండూ ఉంటే చాలు అనే రోజులు వెళ్లిపోతున్నాయి. ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న పోటీని తట్టుకుని నిలబడాలన్నా, కమర్షియల్‌ హీరోయిన్​గా స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలన్నా తమలోని అదనపు ప్రతిభను ప్రదర్శించాల్సిందే. అందుకే నవతరం భామలు తమలోని టాలెంట్​ను ప్రదర్శించడంలో పరిమితం కావడం లేదు.

అయితే హీరోయిన్​గా రాణించాలంటే అదనపు ప్రతిభల్లో డ్యాన్స్‌ కూడా ఒకటి. అందుకే ప్రస్తుత తరం నాయికలు అవకాశం వస్తే చాలు డ్యాన్స్‌తో అదరగొట్టే ప్రయత్నం చేస్తూ కుర్రాళ్లను, సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నారు.

అంతకుముందు సీనియర్లు హీరోయిన్లు అనుష్క, తమన్నా, కాజల్ అగర్వాల్​, సమంత, శ్రుతిహాసన్, పూజాహెగ్డే ఇలా చాలామంది తమ డ్యాన్సులతో అదరగొట్టినవారే. తద్వారా కమర్షియల్‌ కథానాయికలుగా ఓ వెలుగు వెలిగారు. అందుకే ఇప్పుడు నవతరం భామలు కూడా వీళ్ల బాటలోనే ప్రయాణం చేస్తూ అదిరిపోయే డ్యాన్స్​లతో ఆకట్టుకుంటున్నారు.

  • ఆ మధ్య గుంటూరు కారంలో 'కుర్చీని మడతపెట్టి' సాంగ్​లో సూపర్ స్టార్​ మహేశ్‌ బాబుతో కలిసి శ్రీలీల చేసిన డ్యాన్స్ హంగామా నషాళానికి తాకింది. భాషతో సంబంధం లేకుండా అందరినీ ఊపేసింది.
  • రెప్పల్‌ డప్పుల్ల సప్పుళ్ళు కొట్టాలిలే పాటల కొత్త భామ భాగ్యశ్రీ బోర్సే డ్యాన్స్‌ కూడా కుర్రాళ్లను ఫిదా చేసేసింది. థియేటర్లలో ఈ పాట వచ్చినప్పుడు యూత్ అంతా ఊగిపోయారు.
  • ఇక దేవర దావూదీ సాంగ్​లో జాన్వీ కపూర్​ కూడా అదరగొట్టింది. తారక్​తో కలిసి ఓ వైపు అందాన్ని చూపిస్తూనే మరోవైవు డ్యాన్స్​తోనూ ఆకట్టుకుంది.

వీళ్లే కాదు తెలుగులోకి వస్తున్న చాలా మంది కొత్త తారలు డ్యాన్స్​లో ఇరగదీస్తున్నారు. అలా తమ డ్యాన్స్​తో కమర్షియల్‌ హీరోయిన్లుగా ఛాన్స్​లు అందుకుంటున్నారు.

ఇక ఆ మధ్య రష్మిక, సాయిపల్లవి, కృతిశెట్టి కూడా డ్యాన్సుల్లో తమ ప్రత్యేకత ప్రదర్శించిన సంగతి తెలిసిందే.

  • రారా సామీఅంటూ పుష్పలో, రంజితమే రంజితమే అంటూ వారసుడు సినిమాలో రష్మిక చేసిన డ్యాన్స్​ హంగామా కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసింది. ఆమె గ్రేస్‌ ప్రేక్షకుల్ని కట్టిపడేసింది.
  • సాయిపల్లవి అయితే టాలీవుడ్​లో డ్యాన్స్​కు కేరాఫ్​ అడ్రెస్ అయిపోయింది. ఫిదా నుంచి మొదలు ఇప్పటివరకు తన డ్యాన్స్​లతో ఫిదా చేస్తూనే ఉంది.
  • పుష్ప సినిమాలో సమంత ఊ అంటావా మావా అంటూ మరోసారి అంతర్జాతీయ స్థాయిలో ఆకట్టుకుంది. కృతి శెట్టి కూడా వారియర్ చిత్రంలో తన డ్యాన్స్​తో అదరగొట్టింది.

చిన్న సినిమాలతో భారీ సక్సెస్ - ఈ వారం థియేటర్లలో అదరగొట్టిన చిత్రాలివే! - Latest movies with low budget

సిద్ధార్థ్, అదితిరావ్ నెట్​వర్త్​ ఎన్ని కోట్లో తెలుసా? - ఈ జంట ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటారంటే? - Siddharth Aditi Rao hydari NetWorth

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.