national

By ETV Bharat Telangana Team

Published : Jun 20, 2024, 1:48 PM IST

ETV Bharat / snippets

'ఐదేళ్లలో 41 ప్రశ్నాపత్రాలు లీక్ - మోదీ ప్రభుత్వం ఒక్క పరీక్షనూ సక్రమంగా నిర్వహించలేకపోతోంది'

Asaduddin Owaisi
Asaduddin Owaisi (ETV Bharat)

UGC NET exam cancellation : నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక్క పరీక్షను కూడా సక్రమంగా నిర్వహించలేకపోతోందని మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. యూజీసీ నెట్ పరీక్ష రద్దు చేసిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. నీట్ కుంభకోణం తర్వాత పేపర్ లీకేజీతో యూజీసీ నెట్ పరీక్షను రద్దు చేశారన్న ఆయన, గడచిన ఐదేళ్లలో దేశంలోని 15 రాష్ట్రాల్లో 41 ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని పేర్కొన్నారు.

పరీక్షలు రాసిన కోటీ 40 లక్షల మంది యువత భవిష్యత్తుతో ఆటలు ఆడుకున్నారని ఆక్షేపించారు. ఉద్యోగాలు ఇవ్వకుండా పేపర్ లీకేజీ ఓ కారణమా అని ప్రశ్నించిన అసద్, పరీక్షా ప్రశ్నాపత్రం రద్దు చేస్తే యువత కఠోర శ్రమ వృథా అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు పది లక్షల మంది యూజీసీ - నెట్ పరీక్ష రాశారని, వారికి క్షమాపణలు చెబుతారా? వారికి జరిగిన నష్టానికి పరిహారం ఇస్తారా? అని ఒవైసీ ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details