Health Benefits Of Betel Leaves In Telugu : పూజలు, శుభకార్యాలకు, ముత్తైదువులకు వాయనమివ్వడానికి పూలు పండ్లతో పాటు ఎక్కువగా తమలపాకులు ఉపయోగిస్తారు. ఇంట్లో ఏ పండుగ అయినా, శుభకార్యం అయినా తమలపాకులు లిస్ట్‌లో ఉండాల్సిందే. ఇలా శుభప్రదంగా వాడే తమలపాకులు కొన్ని రకాల ఆరోగ్య సమస్యలనూ దూరం చేస్తాయంటున్నారు నిపుణులు. ఇందులో వీటిలోని ఔషధ గుణాలే కారణమట. మరి అవేంటో తెలుసుకుందామా?
- కొంతమందికి రోజూ తమలపాకులు తినే అలవాటు ఉంటుంది. అలా రోజూ తమలపాకు తినడం వల్ల శరీరంలో ఏవైనా ఆరోగ్య సమస్యలుంటే వెంటనే తొలగిపోతాయి. పెద్ద గ్లాస్ నీటిలో కొన్ని తమలపాకులు వేసి, ఆ నీళ్లు సగమయ్యేంత వరకు మరిగించాలి. ఈ నీటిని ప్రతిరోజూ తాగడం వల్ల వివిధ రకాల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.
- తమలపాకులు నోటి దుర్వాసనను దూరం చేస్తాయి. అలాగే చిగుళ్ల నుంచి వచ్చే బ్లీడింగ్‌ను ఆపి దంతాలను దృఢపరిచే గుణం తమలపాకులకు ఉంటుంది.
- చర్మంపై అలర్జీ, దురద మొదలైన సమస్యలను తగ్గిస్తాయి తమలపాకులు. వీటిలో ఉండే యాంటీసెప్టిక్ గుణాలు చర్మ సమస్యలను దూరం చేయడానికి దోహదపడతాయి.
- బాలింతల రొమ్ముల్లో పాలు గడ్డకట్టుకుపోతుంటాయి. దాని వల్ల భరించలేని నొప్పి ఉంటుంది. ఆ సమయంలో తమలపాకులను కొద్దిగా వేడి చేసి ఛాతిపైన ఉంచితే ఉపశమనం లభిస్తుంది.
- తమలపాకులను గాయాలు మానడానికి కూడా ఉపయోగిస్తారు. కొన్ని తమలపాకుల నుంచి తీసిన రసాన్ని గాయంపై రాసి, దానిపై మరో తమలపాకుని పెట్టి కట్టు కడతారు. ఇలా చేస్తే రెండు మూడు రోజుల్లో గాయం మానే అవకాశం ఉంటుంది.
- తమలపాకులను నమిలి, ఆ రసాన్ని మింగడం వల్ల జీర్ణవ్యవస్థ సమస్యలు తగ్గుతాయి. అందుకే భోజనం చేసిన తర్వాత తాంబూలం వేసుకోవడం మంచిదంటారు.
- గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో తమలపాకులు ఎంతో మేలు చేస్తాయి. ఛాతీలో నొప్పి, గుండెలో మంట వంటి సమస్యలతో బాధపడుతున్నావారు తమలపాకుల రసాన్ని తాగితే ఉపశమనం లభిస్తుంది.
- వెన్నునొప్పితో బాధపడేవారు తమలపాకులకు కొద్దిగా నూనె రాసి, నొప్పి ఉన్న చోట మర్దన చేస్తే నొప్పి నుంచి ఉపశమం దొరుకుతుంది.
మనుకా తేనెతో రొమ్ముక్యాన్సర్ చికిత్స- ఎలాంటి ఫలితాలు వచ్చాయంటే..! - Manuka Honey Health Benefits