ETV Bharat / snippets

16 ఏళ్ల నిరీక్షణకు తెర - 2008 డీఎస్సీ అభ్యర్థులకు కాంట్రాక్ట్ జాబ్

DSC BED Candidates Job Recruitment
Contract Jobs For 2008 DSC Candidates (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2024, 9:30 PM IST

2008 DSC Candidates Job Recruitment : 2008 డీఎస్సీ బీఈడీ అభ్యర్థులను కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్ చేయాలని సర్కారు నిర్ణయించింది. 2008 డీఎస్సీలో డీఈడీ అభ్యర్థులకు 30శాతం ఎస్​జీటీ కేటాయించాలన్న జీఓ వల్ల నష్టపోయిన వారికి అవకాశం ఇవ్వనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ మినహా ఇతర జిల్లాల్లో పనిచేసేందుకు 2008 డీఎస్సీ బీఈడీ అభ్యర్థులను విధుల్లోకి తీసుకోనున్నట్టు స్ఫష్టం చేసింది.

ఈ మేరకు ఇప్పటికే 2008 డీఎస్సీలో 30 శాతం రిజర్వేషన్ వల్ల నష్టపోయిన అభ్యర్థుల వివరాలను పాఠశాల విద్యాశాఖ నుంచి సేకరించిన సర్కారు, ఆయా అభ్యర్థులకు కాంట్రాక్ట్ పద్ధతిలో రిక్రూట్మెంట్​పై సమాచారం అందించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పాఠశాల విద్య అధికారిక వెబ్​సైట్​లో కన్సెంట్, వెరిఫికేషన్ దరఖాస్తులను పూర్తిచేయాలని స్పష్టం చేసింది. కాంట్రాక్ట్ పద్ధతిలో జిల్లాల్లో పనిచేసేందుకు ఆసక్తి చూపిన అభ్యర్థులకు ఈ నెల 27 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు జిల్లాల్లో డీఈఓల ఆధ్వర్యంలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేపట్టనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.