MBBS Counselling 2024 in Telangana : రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. గురువారం నుంచి మొదటి రౌండ్ అడ్మిషన్లకు వెబ్‌ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే 16679 మంది విద్యార్థుల వివరాలతో కూడిన ప్రొవిజినల్ జాబితాను కాళోజి వర్శిటీ విడుదల చేసింది. జాబితాలో అభ్యంతరాలు ఉంటే ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు తెలపాలని కాళోజి వర్శిటీ వీసీ కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. అభ్యంతరాల పరిశీలన అనంతరం గురువారం తుది మెరిట్ లిస్ట్ విడుదల చేయనున్నట్టు స్పష్టం చేశారు. అదే రోజు వెబ్ ఆప్షన్లు నమోదు ప్రారంభం అవుతుందని తెలిపారు. విద్యార్థులు వెబ్ ఆప్షన్లు పెట్టుకునేందుకు సిద్దంగా ఉండాలని వెల్లడించారు.
ఎంబీబీఎస్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ షురూ - కన్వీనర్ కోటా మెరిట్ జాబితా విడుదల
Published : Sep 25, 2024, 7:12 AM IST