India denies Visa To Pakisthan Players : ప్రస్తుతం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వేదిక గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతోన్న సంగతి తెలిసిందే. పీసీబీ, ఐసీసీ, బీసీసీఐ మధ్య తీవ్రంగా మాటామంతీ జరుగుతున్నాయి. ఓవైపు పీసీబీ తమ దేశానికి టీమ్ ఇండియా రావాలని మొండి పట్టుబడుతుంటే, మరోవైపు వచ్చేదే లేదని కరాఖండిగా చెబుతోంది భారత్. దీంతో వచ్చే ఏడాది జరగబోయే ఈ ట్రోఫీ నిర్వహణపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అసలు ఏం జరుగుతోందో? ట్రోఫీ నిర్ణయిస్తారా లేదా అని తెలియని గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
ఈ వ్యవహరం ఇంకా పూర్తవ్వనేలేదు, ఇది కొనసాగుతున్నవేళ భారత్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్థాన్‌కు గట్టి షాక్ ఇచ్చింది. త్వరలోనే జరగబోయే ఆసియా కప్ యూత్ స్క్రాబుల్ ఛాంపియన్‌షిప్, దిల్లీ కప్ టోర్నమెంట్‌ల కోసం ఆడనున్న చాలా మంది పాక్ ప్లేయర్లకు వీసాలు ఇచ్చేందుకు భారత హైకమిషన్ నిరాకరించింది.
వాస్తవానికి పాక్ ప్లేయర్లు రెండు నెలల ముందుగానే దరఖాస్తులు సమర్పించారు. కానీ వాటిని భారత హైకమిషన్ చూసిచూడనట్లుగా వదిలేసింది. ఇప్పుడేమో తాజాగా ఆ ఆటగాళ్లకు వీసాలు జారీ చేయమని చెప్పి షాక్ ఇచ్చింది. దీంతో ఇప్పుడీ విషయం కూడా చర్చనీయాంశంగా మారింది.
అసంతృప్తి వ్యక్తం చేసిన పీఎస్‌ఏ డైరెక్టర్ - వీసాల జారీ చేయం అంటూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాకిస్థాన్ స్క్రాబుల్ అసోసియేషన్ (పీఎస్‌ఏ) డైరెక్టర్ తారిక్ పర్వేజ్ స్పందించారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీమ్‌లోని చాలా మంది ప్లేయర్లకు ఎలాంటి వివరణ లేకుండానే వీసా నిరాకరించినట్లు తారిక్ వెల్లడించారు. "గత ఏడాది భారత్‌లో పోటీ పడి మరీ గెలుపొందిన ప్లేయర్స్‌తో పాటు జట్టులోని సగం మందికి అస్సలు ఎలాంటి వివరణ లేకుండా వీసాలను నిరాకరించారు. ప్రపంచ యూత్ ఛాంపియన్, ఆసియా యూత్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను ముద్దాడిన పాకిస్థాన్ జట్టు గైర్హాజరు కావడం టోర్నమెంట్‌కు గట్టి ఎదురు దెబ్బ" అని తారిక్ పేర్కొన్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ రగడపై ఐసీసీ ప్లాన్ బీ - పాకిస్థాన్ చేతులెత్తేస్తే ఆ దేశంలోనే టోర్నీ!
టీమ్ ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఆ స్టార్ ప్లేయర్ రీఎంట్రీ!