ETV Bharat / offbeat

మైసూర్ బోండాకు హోటల్ రుచి రావట్లేదా? - ఈ టిప్స్ పాటిస్తే అమోఘమైన టేస్ట్! - How to Prepare Mysore Bonda - HOW TO PREPARE MYSORE BONDA

How To Make Hotel Style Mysore Bonda: మైసూర్ బోండాలు అంటే చాలా మందికి ఎంతో ఇష్టం. కానీ.. ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హోటల్​లో తిన్నంత టేస్టీ​గా అనిపించవు. లోపల కూడా పిండిపిండిగా ఉండిపోతుంది. కానీ అలా కాకుండా రౌండ్​గా, ఫ్లఫ్పీగా హోటల్ స్టైల్​లో రావాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

How To Make Hotel Style Mysore Bonda
How To Make Hotel Style Mysore Bonda (ETV Bharat)
author img

By ETV Bharat Features Team

Published : Sep 23, 2024, 11:57 AM IST

How To Make Hotel Style Mysore Bonda: బ్రేక్​ఫాస్ట్, సాయంత్రం స్నాక్స్​​లో ఎక్కువ మంది ఇష్టపడే పదార్థా​లో మైసూర్​ బోండా ఒకటి. బయట హోటల్స్​కు వెళ్లినప్పుడు వీటిని తింటుంటారు. అయితే.. అక్కడ తిన్నప్పుడు అవి ఎంతో టేస్టీగా, సాఫ్ట్​గా, ఫ్లఫ్పీగా అనిపిస్తాయి. కానీ, మనం ఇంటి వద్ద ప్రిపేర్ చేసుకుంటే మాత్రం తేడా కొట్టేస్తుంది. ఇక అలాంటి ఇబ్బంది లేకుండా.. ఇలా చేస్తే బయట హోటల్ కంటే కూడా టేస్టీగా, పర్​ఫెక్ట్ షేప్​తో ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు..

  • ఒక కప్పు పుల్లటి పెరుగు
  • రుచికిసరిపడా ఉప్పు
  • ఒక టేబుల్ స్పూన్ నూనె
  • ఒక టీ స్పూన్ వంట సోడా
  • ఒక కప్పు మైదా పిండి
  • ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర
  • ఒక టేబుల్ స్పూన్ కరివేపాకు
  • అర టేబుల్ స్పూన్ అల్లం
  • ఒక టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు

తయారీ విధానం

  • ముందుగా ఓ గిన్నెలో పుల్లటి పెరుగు తీసుకుని సుమారు 10 నిమిషాలపాటు బాగా కలపాలి.
  • ఆ తర్వాత ఇందులోకి ఉప్పు, వంట సోడా, నూనె పోసి 3 నిమిషాలు కలపాలి.
  • ఇందులోనే మైదా పిండిని పోసి వేడి నీళ్లను కలుపుతూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. (పిండి మరీ లూజ్​గా మారితే బోండాలు మంచిగా రావు. మైదా పిండి వద్దనుకునే వారు గోధుమ పిండితోనూ చేసుకోవచ్చు)
  • ఇలా కలిపిన పిండిని కిందకి పైకి కొడుతూ సుమారు 5 నిమిషాలు బీట్ చేసుకోవాలి.(ఇందువల్ల లోపల బబుల్స్ ఫామ్ అయ్యి బోండాలు ఫ్లఫ్పీగా వస్తాయి. కలిపే విధానం వల్ల బోండా టేస్ట్, షేప్ వస్తుంది)
  • ఆ తర్వాత జీలకర్ర, కరివేపాకు, అల్లం, పచ్చిమిర్చి వేసుకుని అన్ని బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. (అల్లం, పచ్చిమిర్చి నోటికి తగలకూడదు అనుకుంటే కచ్చాపచ్చగా దంచుకుని వేసుకోవచ్చు)
  • ఈ మిశ్రమంపై వస్త్రం లేదా మూత పెట్టి సుమారు గంట వరకు నానబెట్టుకోవాలి. (ఎంత సేపు నానబెడితే బోండాలు అంత బాగా వస్తాయి)
  • గంట తర్వాత స్టౌ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని నూనె పోసి వేడిచేసుకోవాలి.
  • ఇప్పుడు పిండిని కదపకుండా ఓ పక్క నుంచి తీసుకుని వేడిగా ఉన్న నూనెలో మెల్లగా వేసుకోవాలి.(పిండి చేతికి అంటుకుంటుంది అనుకుంటే కొద్దిగా చేతిని నీటితో తడి చేసుకోండి)
  • స్టౌ మీడియం ఫ్లేమ్​లో పెట్టుకుని రెండు వైపులా ఎర్రగా అయ్యేవరకు కాల్చుకోవాలి.
  • ఇప్పుడు టిష్యూ ఉన్న గిన్నెలో వేసుకుంటే నూనెను పీల్చుకుంటుంది.
  • ఆ తర్వాత వీటిిని పల్లీ చట్నీ, టమాటా చట్నీలో తింటే సూపర్​గా ఉంటాయి.

గోధుమ పిండితో బాదుషా! - రుచి, ఆరోగ్యం ఒకేసారి - ఈ పండక్కి ఇలా తయారు చేయండి - Wheat Flour Badusha Recipe at Home
సండే స్పెషల్: నాటుకోళ్లు దొరకడం లేదా? - ఈ పద్ధతిలో వండితే బ్రాయిలర్​ చికెన్​తోనే నాటుకోడి రుచి! - How to Prepare Chicken Curry

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.