ETV Bharat / offbeat

చక్కెర, బెల్లం లేకుండానే స్వీట్- ఈజీగా హెల్దీగా "కేసరిబాత్" చేసుకోండిలా! - how to make sugar cane kesar bat

author img

By ETV Bharat Features Team

Published : 3 hours ago

How to Make Sugar Cane Kesar Bat: స్వీట్స్ అంటే.. చక్కెర, బెల్లంతో తయారు చేసినవే ఉంటాయి. కానీ ఎప్పుడైనా చెరకు రసంతో చేసే స్వీట్లను తిన్నారా? నో అంటే మాత్రం.. ఈ స్టోరీ చదివాల్సిందే.. ఆ స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసుకోవాల్సిందే!

How to Make Sugar Cane Kesar Bat
How to Make Sugar Cane Kesar Bat (ETV Bharat)

How to Make Sugar Cane Kesar Bat: ఇంట్లో ఏదైనా వేడుకలైనా.. పండగలైనా చాలా మంది స్వీట్లు చేస్తుంటారు. అయితే.. ఎన్ని రకాల స్వీట్లు తిన్నా.. ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయే రవ్వ హల్వా వెరీ స్పెషల్. ఈ స్వీట్ రెసిపీని పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే.. దీనిని చాలా మంది చక్కెర లేదా బెల్లం ఉపయోగించి చేస్తుంటారు.

కానీ.. ఇప్పుడు మనం వెరైటీగా చెరకు రసంతో ట్రై చేద్దాం. ఈ పద్ధతిలో పక్కా కొలతలతో ట్రై చేశారంటే టేస్ట్ అదిరిపోతుంది. ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. మరి, ఇంకెందుకు ఆలస్యం? ఇందులోకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు

  • 2 టీ స్పూన్ల నెయ్యి
  • 10 జీడిపప్పులు
  • 20 ఎండు ద్రాక్షలు
  • అర కప్పు బొంబాయి రవ్వ
  • రెండు కప్పుల చెరకు రసం
  • పావు కప్పు నెయ్యి
  • అర టీ స్పూన్ నానబెట్టిన కుంకుమ పువ్వు నీరు (సాఫ్రన్ కలర్)
  • అర టీ స్పూన్ యాలకుల పొడి

తయారీ విధానం

  • ముందుగా స్టౌ ఆన్ చేసుకుని ఓ కడాయిలో నెయ్యి పోసుకుని వేడి చేసుకోవాలి.
  • నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేసి ఎర్రగా, క్రిప్సిగా అయ్యేవరకు వేయించుకోని తర్వాత తీసి పెట్టుకోవాలి
  • ఇప్పుడ అందులోనే ఎండు ద్రాక్షలు వేసి ఎర్రగా వేయించుకుని పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత ఓ గిన్నెలో కొద్దిగా నెయ్యి పోసి వేడి చేసుకోవాలి.
  • అనంతరం బొంబాయి రవ్వ పోసి సుమారు 6 నిమిషాల పాటు వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి.
  • ఆ తర్వాత అందులోనే చెరకు రసం పోసి సుమారు 5 నిమిషాల పాటు బాగా వేడి చేసుకోవాలి.
  • అందులోనే వేయించి పెట్టుకున్న బొంబాయి రవ్వను వేసి బాగా కలపి 3 నిమిషాల పాటు మగ్గనివ్వాలి.
  • ఇప్పుడు మూత తీసి బాగా కలిపి పావు కప్పు నెయ్యి పోసి మరోసారి కలపాలి.
  • 10 నిమిషాల పాటు వేడి నీటిలో నానబెట్టిన కేసరి, వేయించుకున్న జీడిపప్పు, ఎండు ద్రాక్షలు, యాలకుల పొడి వేసి కలిపితే టేస్టీ కేసరిబాత్ రెడీ!
  • ఈ కేసరిబాత్​ను వేడివేడిగా తిన్నా లేదా చల్లారిన తర్వాత తిన్నా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది.

స్కూల్లో లంచ్ బాక్స్ తినకుండా పిల్లలు ఇంటికి తెస్తున్నారా? - ఈ 'గార్లిక్ రైస్' పెట్టండి - మొత్తం ఖాలీ చేసేస్తారు! - Chilli Garlic Ghee Rice Preparation

రక్తహీనత సమస్యా? - ఇలా బీట్​ రూట్ చపాతీ చేసేయండి - అద్దిరిపోయే రుచి, అదనపు ఆరోగ్యం - How to Prepare Beetroot Chapati

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.