ETV Bharat / snippets

దసరాలోపు మెట్రో విస్తరణ రూట్‌కు డీపీఆర్‌ను సిద్ధం చేసి కేంద్రానికి పంపాలి : సీఎం రేవంత్​

CM Revanth Reddy Review On Metro Expansion
CM Revanth Review On Metro Expansion (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2024, 10:13 PM IST

CM Revanth Review On Metro Expansion : దసరాలోపు మెట్రో విస్తరణకు సంబంధించిన పూర్తిస్థాయి డీపీఆర్ సిద్ధం చేసి కేంద్రానికి సమర్పించాలని ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అధికారులకు సూచించారు. ఎయిర్​పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గంపై సమగ్ర నివేదిక తయారు చేయాలని సీఎం ఆదేశించారు. ఓల్డ్​ సిటీ మెట్రో విస్తరణ పనులను వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి చెప్పారు. మెట్రో విస్తరణపై జూబ్లీహిల్స్​లోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఎల్బీనగర్ నుంచి హయత్​నగర్ వరకు, ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్టతో పాటు ఇతర మెట్రో విస్తరణకు సంబంధించి పలు అంశాలను అధికారులు సీఎంకు వివరించారు. మెట్రో మార్గాలకు భూసేకరణ, ఇతర విషయాల్లో అడ్డంకులుంటే వాటిపై ప్రత్యేకంగా దృష్టి సారించి, పరిష్కరించాలని అధికారులకు సీఎం తెలిపారు. సమావేశంలో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి దానకిషోర్, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తదితరులు పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.