ETV Bharat / international

కమలా హారిస్‌ ప్రచార కార్యాలయంపై కాల్పులు - అమెరికాలో మళ్లీ కలకలం! - Gunfire In Harris Campaign Office

Gunfire Damages Harris Campaign Office : అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు చెందిన పార్టీ ప్రచార కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు అర్థరాత్రి తుపాకులతో దాడి చేశారు. అయితే అర్థరాత్రి సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

kamala harris
kamala harris (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2024, 8:40 AM IST

Gunfire Damages Harris Campaign Office : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులపై జరుగుతున్న దాడులు భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఇంతకు ముందు డొనాల్డ్ ట్రంప్​పై హత్యాయత్నం జరగగా, తాజాగా కమలా హారిస్​ ప్రచార కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు అర్థరాత్రిపూట తుపాకులతో దాడి చేశారు.

అమెరికాలో నవంబరులో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులుగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌లు బరిలో ఉన్నారు. అయితే వీరిపై జరుగుతున్న దాడులు సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా కమలా హారిస్‌ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు గడచిన అర్థరాత్రి తుపాకులతో దాడులకు తెగబడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, అరిజోనాలోని డెమోక్రటిక్‌ పార్టీ సమన్వయ ప్రచార కార్యాలయంపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో కార్యాలయంలోని సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కార్యాలయం కిటికీల వద్ద నుంచి కాల్పులు జరిపినట్లు అధికారులు గుర్తించారు. అర్థరాత్రి సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు.

ట్రంప్​పై హత్యాయత్నం
ఇటీవల మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై సైతం వరుస కాల్పులు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఫ్లోరిడాలోని వెస్ట్‌ పామ్‌ బీచ్‌లో ట్రంప్‌ గోల్ఫ్‌ ఆడుతుండగా నిందితుడు హత్యాయత్నం చేశాడు. ఫెన్సింగ్‌ వద్ద నుంచి నిందితుడు తుపాకీతో రావడాన్ని గమనించిన భద్రతా బలగాలు కాల్పులు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నాయి. 2 నెలల క్రితం పెన్సిల్వేనియాలో ఎన్నికల సభలో ట్రంప్‌ ప్రసంగిస్తుండగా కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల్లో ట్రంప్‌ కుడి చెవి పైభాగం నుంచి తూటా దూసుకువెళ్లింది. తాజాగా కమలా హారిస్‌ ప్రచార కార్యాలయంపై కాల్పులు జరగడం సంచలనం సృష్టిస్తుంది.

ముందంజలో కమలా హారిస్‌
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలా హారిస్‌, రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ కంటే ముందంజలో ఉన్నారు. ఆసియన్‌ అమెరికన్‌ ఓటర్లలో 38 పాయింట్లతో కమలా హారిస్​ ముందజలో ఉన్నట్లు తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. చికాగో విశ్వవిద్యాలయంలో ఎన్‌ఓఆర్‌సీ నిర్వహించిన సర్వేకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. ీ పోల్‌ ప్రకారం, ఆసియా అమెరికన్‌ ఓటర్లలో 66 శాతం మంది హారిస్‌కు మద్దతుగా ఉండగా, కేవలం 28 శాతం మంది మాత్రమే ట్రంప్‌నకు మద్దతుగా నిలిచారు. బైడెన్‌ అభ్యర్థిగా ఉన్నప్పుడు నిర్వహించిన సర్వేలో 46 శాతం బైడెన్‌కు మద్దతు పలకగా, 31 శాతం మంది ట్రంప్‌నకు అనుకూలంగా ఉన్నారు.

'ఈసారి ఓడిపోతే మళ్లీ పోటీ చేయను' - డొనాల్డ్ ట్రంప్‌ కీలక ప్రకటన - Trump 2024 Last Run Statement

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.