ETV Bharat / entertainment

మీనాక్షి చౌదరి ఆన్ డిమాండ్ - 4 సినిమాలు పూర్తి​, మరో 8 రోజుల్లో ఇంకో 2 చిత్రాలతో! - MEENAKSHI CHAUDHARY UPCOMING MOVIES

వరుస చిత్రాలతో ఫుల్​ బిజీగా మారిన హీరోయిన్ మీనాక్షి చౌదరి!

Meenakshi Chaudhary Upcoming Movies
Meenakshi Chaudhary Upcoming Movies (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2024, 10:34 PM IST

Meenakshi Chaudhary Upcoming Movies : వరుస చిత్రాల్లో ప్రేక్షకులను అలరిస్తోంది అందాల భామ మీనాక్షి చౌదరి. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ మదుగుమ్మదే హవా నడుస్తోంది. ఈ ఏడాదిలో ఇప్పటికే నాలుగు చిత్రాలతో(గుంటూరు కారం, సింగపూర్ సెలూన్, ది గోట్​, లక్కీ భాస్కర్​) సందడి చేసింది. రీసెంట్‌గానే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్​తో కలిసి లక్కీ భాస్కర్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది.

అయితే ఇప్పుడీ అమ్మడి డిమాండ్ ఎలా ఉందంటే మళ్లీ కేవలం 8 రోజుల గ్యాప్​లో 2 సినిమాలతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన పీరియాడిక్ డ్రామా మట్కాతో నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాలో వరుణ్​ భార్య పాత్రలో మీనాక్షి చౌదరి నటించింది. డీగ్లామర్ పాత్రలో ఆమె మెరిసింది.

అనంతరం వచ్చే వారం నవంబర్ 22న మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన మెకానిక్ రాకీ సినిమాలోనూ మీనాక్షి హీరోయిన్‌గా నటించింది. ఇందులో ఈ ముద్దుగుమ్మ గ్లామరస్ రోల్‌లో కనిపించనుంది. అలా మరో 8 రోజుల్లో రెండు వైవిధ్యమైన సినిమాల్లో, రెండు విభిన్నమైన పాత్రలతో సినీ ప్రియులను అలరించేందుకు మీనాక్షి చౌదరి సిద్ధమయ్యింది. చూడాలి మరి ఈ రెండు చిత్రాలు మీనాక్షి చౌదరికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తాయో.

Meenakshi Chaudhary Background : కాగా, హరియాణాకు చెందిన మీనాక్షి చౌదరి సినిమాల్లోకి రాకముందు మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొంది. ఫెమినా మిస్‌ ఇండియా హరియాణా విజేతగా (2018) కిరీటాన్ని అందుకుంది. అనంతరం ఇచ్చట వాహనములు నిలుపరాదు చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది మీనాక్షి. ఖిలాడి, హిట్‌ 2 సినిమాలతో గుర్తింపు తెచ్చుకుంది. కథకు అవసరమైతేనే ముద్దు సన్నివేశాల్లో నటించాలనే నియమం పెట్టుకుందీ భామ. అయితే అశ్లీల సీన్స్‌లో కనిపించకూడదని నిర్ణయించుకుని, ఎన్నో అవకాశాలను తిరస్కరించింది. ఈ ముద్దుగుమ్మకు ట్రావెలింగ్‌ అంటే ఎంతో ఇష్టమట. కాస్త ఖాళీ దొరికినా విదేశాలకు వెళ్లి వస్తుంటుంది. ఈమె ప్రకృతి ప్రేమికురాలు కూడా.

'చాలా బాధగా ఉంది' - 'పుష్ప 2' గురించి మాట్లాడిన రష్మిక

18 ఏళ్ల తర్వాత హిట్‌ కాంబో - స్పెషల్ అప్డేట్​ ఇచ్చిన అనిల్‌ రావిపూడి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.