ETV Bharat / spiritual

ఆ రాశివారికి ఆదాయానికి మించిన ఖర్చులు - కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మంచిది! - HOROSCOPE TODAY

నవంబర్ 14వ తేదీ (గురువారం) రాశిఫలాలు

Daily Horoscope
Daily Horoscope (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 14, 2024, 4:31 AM IST

Horoscope Today November 14th 2024 : నవంబర్ 14వ తేదీ (గురువారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. శారీరకంగా, మానసికంగానూ శక్తివంతంగా ఉంటారు. అందుకే అన్ని రంగాల వారికి ఈ రోజంతా శాంతిమయంగా గడుస్తుంది. చేపట్టిన అన్ని పనులూ ఉత్సాహంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మాతృ వర్గం నుంచి ఆర్థిక పరమైన లబ్ధి ఉండవచ్చు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. స్నేహితులు, బంధువుల రాకతో ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ శుభప్రదం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి పరంగా ఈ రోజు మీకు అంత ఆశాజనకంగా ఉండదు. ఆరోగ్యపరమైన, ఆర్థిక పరమైన సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. చేపట్టిన పనులు అసంపూర్ణంగా మిగులుతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడతారు. మీ పరుషమైన మాటల కారణంగా ప్రియమైన వారితో విబేధాలు తలెత్తవచ్చు. కార్యసిద్ధి హనుమ ఆరాధన శ్రేయస్కరం.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి పరంగా కొన్ని కీలక వ్యవహారాల్లో ఎటు తేల్చుకోలేక ఊగిసలాటలో ఉంటారు. ఆచరణ సాధ్యం కాని విషయాలలో అతిగా స్పందించవద్దు. శక్తికి మించిన పనులు చేయాలని చూస్తే చిక్కుల్లో పడతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కుటుంబ సభ్యుల పట్ల మీ వైఖరి మార్చుకుంటే మంచిది. శివారాధన శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ శ్రేయస్సు కోసం పనిచేస్తారు. కుటుంబంలోని చిన్నవారి పట్ల బాధ్యతతో ఉంటారు. కుటుంబంలో వేడుకలు జరిగే సూచన ఉంది. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురుకావచ్చు. ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలుండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో విజయాలు సాధించాలంటే తీవ్రమైన కృషి అవసరం. ఆర్థికంగా క్లిష్టమైన పరిస్థితులు ఉండవచ్చు. కుటుంబ సభ్యుల అండతో సమస్యలను అధిగమిస్తారు. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో సానుకూల ఫలితాలు పొందడానికి ఎక్కువ కష్టపడాలి. హనుమాన్ చాలీసా పారాయణతో మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ఫలితాలు ఉండక పోవచ్చు. బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. సౌందర్య సాధనాల కోసం అధికంగా ధనవ్యయం చేస్తారు. చేసే పని పట్ల చిత్తశుద్ధి, ఏకాగ్రత అవసరం. ఖర్చులు పెరగవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మీ గణపతిని పూజిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్ని రంగాల వారికి వృత్తి పరంగా, వ్యక్తిగతంగా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. కోపావేశాల కారణంగా మంచి అవకాశాలను కోల్పోతారు. దూకుడు కారణంగా అదృష్టం అందినట్లే అంది చేజారుతుంది. వివాదాలు, సమస్యలకు మీరు దూరంగా ఉంటే మంచిది. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉంటాయి. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు చాలా మంచి రోజు. వృత్తి వ్యాపారాలలో ఊహించిన దానికన్నా అధికంగా శుభ ఫలితాలు ఉంటాయి. గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నందున ధనదాయం పెరుగుతుంది. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. సన్నిహితుల నుంచి శుభవార్తలు అందడంతో మీ సంతోషం రెట్టింపు అవుతుంది. ఉద్యోగస్థులు పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. గణపతి ప్రార్ధన శుభప్రదం.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. వృత్తి వ్యాపారాలలో తరచూ కలుగుతున్న అపజయాలకు కృంగిపోవద్దు. కుటుంబ కలహాలు రాకుండా జాగ్రత్త వహించండి. సంతానం విషయంగా కొంత ఆందోళన చెందే అవకాశం ఉంది. వ్యాపారులు ముఖ్యమైన పనులు, ప్రయణాలు వాయిదా వేసుకుంటే మంచిది. శని స్తోత్రం పారాయణ మేలు చేస్తుంది.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కల్లోలంగా ఉన్న కుటుంబ వాతావరణం కారణంగా మానసిక, శారీరక ఆరోగ్యం క్షీణిస్తుంది. ఏ పని చేయాలన్నా శక్తీ, ఉత్సాహం కొరవడుతోంది. మీ ప్రియమైన వారితో గొడవ పడే ఛాన్స్ ఉంది. వృత్తి పరంగా శత్రువులు పెరిగే ప్రమాదముంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సామాజికంగా అవమానకరమైన పరిస్థితులు ఏర్పడకుండా జాగ్రత్త వహించండి. మొండితనం, నిర్లక్ష్య వైఖరి కారణంగా విలువైనవి కోల్పోతారు. శివ పంచాక్షరీ జపం మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు అదృష్టకరంగా ఉంటుంది. గత కొంతకాలంగా వేధిస్తున్న సమస్యలు నీటి బుడగలా తేలి పోతాయి. అదృష్టం అందలం ఎక్కిస్తుంది. వృత్తి వ్యాపారాలలో ఏ పని చేపట్టినా విజయం వెన్నంటే ఉంటుంది. ఆదాయం గణనీయంగా పెరగడం వల్ల ఆనందంగా ఉంటారు. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటాయి. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఈ రోజు ఖర్చులు అధికంగా ఉండే సూచన ఉంది. వృత్తి పరంగా అంత అనుకూలంగా లేదు. మీ పరుషమైన మాటల కారణంగా సన్నిహితులతో మనస్పర్థలు ఏర్పడవచ్చు. కోపం, ఆవేశం అదుపులో ఉంచుకోవాలి. డబ్బుకు సంబంధించిన విషయాలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించండి. ప్రతికూలమైన ఆలోచనలు వీడితే మంచిది. ఇష్ట దేవత ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.