Range Rover Sport Price Revealed: ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త లగ్జరీ రేంజ్ రోవర్ స్పోర్ట్ కారు ఎంట్రీ ఇచ్చింది. కళ్లు చెదిరే లుక్‌లో మతిచెదిరే ఫీచర్లతో జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఇండియా దీన్ని తీసుకొచ్చింది. కంపెనీ దీన్ని రూ. 1.45 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధరతో పరిచయం చేసింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ ఈ SUVని స్థానికంగా అసెంబుల్ చేస్తుంది.
ఇందులో గమనించదగ్గ విషయం ఏంటంటే.. ఈ తొలి మేడ్ ఇన్ ఇండియా రేంజ్ రోవర్ స్పోర్ట్ ధర గతంలో కంటే ఇప్పుడు రూ.5 లక్షలు పెరిగింది. ఎందుకంటే కంపెనీ ఈ కారు డైనమిక్ SE వేరియంట్ సేల్స్‌ను నిలిపివేసింది. దీంతో ఇప్పుడు ఈ 2025 రేంజ్ రోవర్ స్పోర్ట్ డైనమిక్ HSE కారే ఈ లైనప్‌లో ఎంట్రీ లెవల్ వేరియంట్.
ఫీచర్లు: ఇందులో సెమీ-అనిలిన్ లెదర్ సీట్లు, పవర్డ్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ సీట్లు, హెడ్-అప్ డిస్‌ప్లే, ఆటో-పార్కింగ్ అసిస్ట్‌తో పాటు డైనమిక్ SE డిజిటల్ LED హెడ్‌లైట్లు, సిగ్నేచర్ డేటైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఎయిర్ సస్పెన్షన్, పవర్డ్ అండ్ హీటెడ్ వెనక సీట్లతో పాటు మెరిడియన్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
వీటితో పాటు ఆటోబయోగ్రఫీ వేరియంట్లో కంపెనీ మరిన్ని ఫీచర్లను అందిస్తోంది. ఈ ఫీచర్లలో ఫ్రంట్ మసాజ్ సీట్లు, ఫ్రంట్ అండ్, రియర్ వింగ్డ్ హెడ్‌రెస్ట్‌లు, ఇల్యూమినేటెడ్ సీట్ బెల్ట్ బకిల్స్ రేంజ్ రోవర్ లెటరింగ్‌తో ఇల్యూమినేటెడ్ అల్యూమినియం ట్రెడ్ ప్లేట్లు ఉన్నాయి.
పవర్‌ట్రెయిన్: ఈ '2025 రేంజ్ రోవర్ స్పోర్ట్' కారు ఇంజిన్ ఆప్షన్లలో ఎలాంటి మార్పూ లేదు. ఇది అదే పాత రెండు ఇంజిన్ ఆప్షన్లలో వస్తుంది. ఇందులో మొదటిది 3.0-లీటర్, 6-సిలిండర్, P400 టర్బో-పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్. ఇది 400hp పవర్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కాకుండా వినియోగదారులు 3.0-లీటర్, 6-సిలిండర్ D350 డీజిల్ ఇంజిన్‌ను కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది 351hp శక్తిని అందిస్తుంది. ఈ రెండు ఇంజిన్లు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, 4x4 టెక్నాలజీతో వస్తాయి.
వేరియంట్స్: కంపెనీ మరికొద్ది నెలల్లో ఈ లేటెస్ట్ '2025 రేంజ్ రోవర్ స్పోర్ట్'ను ఐదు వేరియంట్లలో తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
- P400 డైనమిక్ HSE
- D350 డైనమిక్ HSE
- P460e PHEV ఆటోబయోగ్రఫీ
- P530 ఆటోబయోగ్రఫీ
- P530 SV ఎడిషన్
ధరలు:
సమాచారం ప్రకారం.. P400 డైనమిక్ HSE, D350 డైనమిక్ HSE రెండూ రూ. 1.45 కోట్ల ధరతో రానున్నాయి. P460e PHEV ఆటోబయోగ్రఫీ వేరియంట్‌ను రూ. 2.11 కోట్ల ధరతో తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇక P530 ఆటోబయోగ్రఫీ (4.4-లీటర్ V8తో), P530 SV ఎడిషన్ రెండూ CBU ఇంపోర్ట్స్. ఇవి వరుసగా రూ. 2.12 కోట్లు, రూ. 2.95 కోట్ల ధరలతో రాబోతున్నాయి.
బజాజ్ చేతక్ నయా ఈవీ ఆగయా- సింగిల్ ఛార్జ్‌తో 153కి.మీ రేంజ్
అద్భుతమైన డిజైన్, ప్రీమియం ఫీచర్లు.. కియా కొత్త కారు అదుర్స్!- జనవరి 3 నుంచి బుకింగ్స్
రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొంటున్నారా? అయితే ఆగండి.. త్వరలో 4 కొత్త మోడల్స్!