Girl Kidnapped In Adilabad : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లో మతిస్తిమితం లేని బాలిక (13)ను పక్కింటి యువకుడు గదిలో బంధించాడు. ఈ ఘటన శనివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బాలిక బంధువులు, స్థానికులు నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు. వారిని అదుపు చేయడానికి వెళ్లిన పోలీసులపై కాలనీవాసులు రాళ్ల దాడి చేశారు. దీంతో సీఐ, ఎస్సైతో సహా మరో ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్‌లోని ఎస్సీ కాలనీలో నివసించే పోశెట్టి (25) తన ఇంటి పక్కనే ఒంటరిగా ఉన్న మతిస్తిమితం లేని బాలికను తన ఇంట్లో బంధించాడు. కూలీ పనులకు వెళ్లి సాయంత్రం వచ్చిన తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించకపోవడంతో అనుమానం వచ్చి పోశెట్టి ఇంట్లో వెతికారు. అక్కడ బాలిక బందీగా ఉండటం చూసి కాలనీవాసులకు సమాచారం అందించారు. కొద్దిసేపట్లోనే పెద్ద సంఖ్యలో స్థానికులు అతడి ఇంటి ముందుకు వచ్చి నిరసన చేశారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు.
కాలనీవాసుల ఆందోళన - నిందితుడి ఇంటికి నిప్పు : అక్కడ నిందితుడిని అదుపులోకి తీసుకోగా, అతడిని తమకు అప్పగించాలంటూ కాలనీవాసులు డిమాండ్ చేశారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేస్తామని నచ్చజెప్పారు. ఎంత చెప్పినా వినకుండా బాలిక బంధువులు నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో ఇంట్లోని సామగ్రి మొత్తం కాలిపోయాయి. అక్కడున్న కొంత మంది నిందితుడిపై దాడి చేశారు. దీంతో నిందితుడిని తరలించడానికి పోలీసులు ప్రయత్నించగా వారిపై స్థానికులు రాళ్ల దాడికి దిగారు.
పోలీసులపై రాళ్ల దాడి : ఈ దాడిలో సీఐ భీమేష్‌తో పాటు ఎస్సై తిరుపతి, సీఐ గన్‌మేన్ భూమేష్, కానిస్టేబుల్ రవీందర్, వాహన డ్రైవర్ నందులు తీవ్రంగా గాాయపడ్డారు. వెంటనే స్పందించిన ఉన్నతాధికారులు అదనపు బలగాలను అక్కడికి పంపించారు. గాయపడిన పోలీసులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. లాఠీఛార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. నిందితుడిని, బాధిత బాలికను ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అమ్మకు యాక్సిడెంట్ అని చెప్పి బాలిక కిడ్నాప్ - కాకపోతే మధ్యలో సీన్ రివర్సైంది
త్వరలో వివాహం - ప్రేమించిన వాడితో వెళ్లిపోయిన యువతి - మహిళపై కుటుంబసభ్యుల దాడి