ETV Bharat / offbeat

దుస్తులకు చూయింగ్​ గమ్​ అంటుకుంటే - ఈ టిప్స్​తో క్షణాల్లో వదిలించుకోండి! - REMOVE CHEWING GUM ON CLOTHES

- మౌత్ ఫ్రెష్ కోసం చూయింగ్​ గమ్​ - వస్త్రాలకు అంటుకుంటే ఇలా చేయాలంటున్న నిపుణులు

How to Remove Chewing Gum on Clothes
How to Remove Chewing Gum on Clothes (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Dec 22, 2024, 5:33 PM IST

How to Remove Chewing Gum on Clothes: కొందరు ఫ్రెష్ నెస్ కోసం.. మరికొందరు నోటి నుంచి స్మెల్ రాకుండా.. ఇంకొందరు టైమ్ పాస్ కోసం.. ఇలా కారణం ఏదైతేనేమి చూయింగ్ గమ్ నములుతుంటారు చాలా మంది. అయితే చూయింగ్​ గమ్​ నమలడం వరకు బానే ఉన్నా.. దాన్ని పడేసేటప్పుడు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ఎక్కడ పడితే అక్కడ పడేయడం, బెంచీలు, కుర్చీలు, డెస్కులు, వాహనాల సీట్లపై అతికించడం.. వంటివి చేస్తుంటారు. దీంతో మనకు తెలియకుండానే అది మన దుస్తులకు, వస్తువులకు అతుక్కుపోతుంటుంది. ఇక ఒక్కసారి అంటుకున్న తర్వాత.. ఎంత రుద్దినా ఓ పట్టాన వదలదు. అలాంటప్పుడు ఈ సింపుల్‌ చిట్కాలు పాటిస్తే సత్వర ఫలితం ఉంటుందంటున్నారు నిపుణులు. అవేంటంటే..

  • దుస్తులకు అంటిన చూయింగ్‌ గమ్‌ని వదిలించడానికి వైట్​ వెనిగర్​ పని చేస్తుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం ఓ గిన్నెలో వెనిగర్‌ని తీసుకొని మైక్రోఅవెన్‌లో ఓ నిమిషం పాటు వేడి చేసి.. బయటకు తీసి.. చూయింగ్ గమ్ అంటుకున్న భాగాన్ని మాత్రమే అందులో ముంచాలి. ఇలా రెండు నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత టూత్‌బ్రష్ సాయంతో రుద్దితే గమ్ సులభంగా వదిలిపోతుందని అంటున్నారు.
  • చూయింగ్ గమ్ అంటుకున్న చోట కొద్దిసేపు ఐస్‌క్యూబ్స్ ఉంచితే దానిని సులభంగా తొలగించచ్చని చెబుతున్నారు.
  • రబ్బింగ్ ఆల్కహాల్ సైతం దుస్తులకు అంటిన చూయింగ్‌గమ్‌ను వదలగొడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందుకోసం స్పాంజ్‌పై రబ్బింగ్ ఆల్కహాల్ పోసి దానితో గమ్‌ను తుడవాలి. ఇలా రెండు నిమిషాలు చేసిన తర్వాత చెక్క స్పూన్ సాయంతో చూయింగ్ గమ్‌ని తీసేస్తే సరిపోతుందని వివరిస్తున్నారు. రబ్బింగ్ ఆల్కహాల్ వల్ల దుస్తుల రంగు, నాణ్యత కూడా దెబ్బతినదని సూచిస్తున్నారు.
  • వేడినీళ్లతో సైతం చూయింగ్ గమ్‌ని వదలగొట్టచ్చంటున్నారు. అందుకోసం వేడి నీటిలో చూయింగ్ గమ్ అంటుకున్న వస్త్రాన్ని ముంచాలి. ఆపై టూత్ బ్రష్‌తో రుద్దడం వల్ల గమ్‌ని సులభంగా వదలగొట్టచ్చని చెబుతున్నారు.
  • ఐరన్ చేయడం ద్వారా కూడా దుస్తులకంటిన చూయింగ్ గమ్‌ని సులభంగా వదిలించచ్చంటున్నారు. దీని కోసం ఐరనింగ్ బోర్డుపై కార్డుబోర్డు ఉంచాలి. దీనిపై గమ్ అంటుకున్న భాగాన్ని కిందికి వచ్చేలా వస్త్రాన్ని పరచాలి. గమ్ అంటుకున్న భాగంపై కర్చీఫ్ లేదా మరో వస్త్రాన్ని ఉంచి హాట్ ఐరన్ చేయాలి. ఐరన్‌ బాక్స్ విడుదల చేసే వేడికి చూయింగ్ గమ్ కరిగిపోయి కార్డుబోర్డుకు అతుక్కుపోయి.. దుస్తుల నుంచి సెపరేట్​ అవుతుందని అంటున్నారు.
  • చూయింగ్ గమ్ అంటుకున్న చోట కొద్దిగా సోప్ రాసి టూత్‌బ్రష్ సాయంతో కాసేపు రుద్దాలని.. అరగంట తర్వాత మరోసారి టూత్‌బ్రష్‌తో రుద్దితే గమ్ సులభంగా వదిలిపోతుందని సూచిస్తున్నారు.
  • హెయిర్‌ స్ప్రేతో సైతం వస్త్రానికి అంటుకున్న చూయింగ్ గమ్‌ని సులభంగా వదిలించచ్చంటున్నారు. దీని కోసం గమ్ ఉన్న చోట కొద్దిగా హెయిర్‌స్ప్రేను స్ప్రే చేయాలి. ఇది చూయింగ్ గమ్‌ను చల్లబడేలా చేస్తుంది. దీంతో చూయింగ్ గమ్‌ని సులభంగా తీసేయచ్చంటున్నారు. అయితే ఒకసారి స్ప్రే చేసినప్పుడు గమ్ వదలకపోతే.. మరోసారి ఇదే పద్ధతిని ప్రయత్నిస్తే సరిపోతుందని వివరిస్తున్నారు.

సూపర్​ ఐడియా - కిచెన్​ గోడలపై నూనె మరకలా? - ఈ టిప్స్​ పాటిస్తే నిమిషాల్లో మాయం!

ఎంత రుద్దినా పాత్రల జిడ్డు పోవడం లేదా? - ఒక్కసారి ఇలా క్లీన్​ చేయండి!

కూరలు మాడు వాసన వస్తున్నాయా? - ఈ టిప్స్​ పాటిస్తే స్మెల్​ పోవడంతోపాటు కర్రీ టేస్ట్​ కూడా అదుర్స్​!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.