ETV Bharat / sports

'జట్టు కోసం పర్సనల్ లైఫ్​ను పక్కనపెట్టావు- మీ అమ్మ ఆస్పత్రిలో ఉన్నా దేశం కోసం ఆడావు'- అశ్విన్​పై మోదీ ప్రశంసలు - PM MODI ON RAVICHANDRAN ASHWIN

రవిచంద్రన్ అశ్విన్​పై ప్రధాని మోదీ ప్రశంసలు- జట్టు కోసం అశ్విన్ వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టారని కితాబు- అశ్విన్​ను అభినందిస్తూ లేఖ రాసిన మోదీ

Pm Modi On Ravichandran Ashwin
Pm Modi On Ravichandran Ashwin (ANI, Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : Dec 22, 2024, 2:20 PM IST

Pm Modi On Ravichandran Ashwin : ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్​బై చెప్పిన రవిచంద్రన్ అశ్విన్‌పై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. భారత క్రికెట్‌కు ఎనలేని సేవలు అందించిన అశ్విన్ ఖేల్‌ రత్న అవార్డును ఇవ్వాలని ఇప్పటికే పలువురు కేంద్ర ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం అశ్విన్ రిటైర్మెంట్​పై స్పందించారు.

'నీ నిర్ణయంతో యావత్ క్రికెట్ అభిమానుల్లో ఆశ్చర్యం'
అశ్విన్‌ను అభినందిస్తూ ప్రధాని మోదీ ప్రత్యేకంగా లేఖ రాశారు. అశ్విన్ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసిందంటూ ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నో ఆఫ్‌ బ్రేక్స్‌, క్యారమ్‌ బంతులతో ప్రత్యర్థులను బేంబెలెత్తించారని అశ్విన్​కు కొనియాడారు. ఇప్పుడు రిటైర్మెంట్ కూడా క్యారమ్‌ బాల్‌ మాదిరిగా ఉందని ప్రశంసించారు. అయితే, ఇలాంటి ప్రకటన చేయడం కూడా అత్యంత కఠినమని అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.

'జట్టు కోసం వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టావు'
"దేశం కోసం అద్భుతమైన ప్రదర్శన చేశావు. అందుకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతున్నాను. జట్టు కోసం వ్యక్తిగత జీవితాన్ని పక్కన పెట్టావు. మీ అమ్మగారు ఆసుపత్రిలో ఉన్నప్పుడూ జట్టు కోసం ఆలోచించావు. చెన్నై వరదలు వచ్చినప్పుడు సాయం చేసేందుకు ముందుకొచ్చావు. ఇక నుంచి జెర్సీ నంబర్ 99ని మేం మిస్‌ కాబోతున్నాం" అని మోదీ లేఖలో అశ్విన్ గురించి రాసుకొచ్చారు.

అశ్విన్ షాకింగ్ డెసిషన్
ఇటీవలే టీమ్​ఇండియా ఆల్​​రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ఆసీస్​తో జరిగిన మూడో టెస్టు అనంతరం అంతర్జాతీయ క్రికెట్​కు వీడ్కోలు చెప్పాడు. దీంతో అతడి 15 ఏళ్ల క్రికెట్ కెరీర్​కు తెరపడింది. భారత్​కు ఎన్నో విజయాలు అందించిన అశ్విన్ సడెన్​గా రిటైర్మెంట్ ప్రకటించడంపై పలువురు స్పందించారు. టీమ్​ఇండియా ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అజింక్యా రహాన్, పుజారా ఎమోషనల్ అయ్యారు. అశ్విన్​తో తమకున్న బంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే మాజీ దిగ్గజాలు సచిన్, కపిల్ దేవ్, సన్ని సైతం అశ్విన్ సేవలను కొనియాడారు.

అశ్విన్ కెరీర్ గణాంకాలు
కాగా, 2009లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభించిన అశ్విన్ భారత్ కు 15ఏళ్లపాటు ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యంగా టెస్టుల్లో భారత్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. తన కెరీర్​ లో 106 టెస్టుల్లో అశ్విన్ 537 వికెట్లు, 3503 పరుగులు చేశాడు. ఇందులో 6 సెంచరీలు ఉన్నాయి. ఇక 116 వన్డేల్లో 156, 65 టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు. ఇంటర్నేషనల్ కెరీర్ ​కు వీడ్కోలు పలికిన అశ్విన్ ఐపీఎల్​ లో కొనసాగనున్నాడు.

'రెండ్రోజుల నుంచి నాకు దిక్కు తోచడం లేదు' - అశ్విన్ భార్య ఎమోషనల్

అశ్విన్ బాటలో టీమ్ ఇండియా సీనియర్లు - వారు రిటైర్మెంట్​ ప్రకటిస్తారా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.