ETV Bharat / international

చేతులు కలిపిన ట్రంప్ & బైడెన్​ - కారణం ఇదే! - BIDEN GREETS TRUMP

పరస్పరం కరచాలనం చేసుకన్న ట్రంప్-బైడెన్​ - అధికార మార్పిడి సజావుగా సాగుతుందని ప్రతిజ్ఞ

Biden greets Trump
Biden greets Trump (AP)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 13, 2024, 10:27 PM IST

Biden Greets Trump : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, త్వరలో అధ్యక్ష పదవిని అలకరించనున్న డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఓవల్ ఆఫస్​లో జరిగిన భేటీలో, అధికార మార్పిడి సజావుగా సాగేందుకు కృషి చేస్తామని ఇరువురు నేతలు ప్రతిజ్ఞ చేశారు.

అభినందనలు
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్​నకు బైడెన్ స్వయంగా అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ, "రాజకీయాలు చాలా కఠినమైనవి. వాస్తవానికి ఈ లోకం ఎల్లప్పుడూ ఒకేలా మంచిగా ఉండదు. కానీ నేడు ఈ ప్రపంచం చాలా బాగుంది" అని అన్నారు.

ఓవల్​ ఆఫీస్​లో ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్​తో బుధవారం ఉదయం 11 గంటలకు ట్రంప్​ భేటీ కావాల్సి ఉంది. కానీ ఆయన కాస్త ఆలస్యంగా రావడం గమనార్హం.

సంప్రదాయం
అమెరికాలో ప్రెసిడెన్సియల్ ఎలక్షన్స్​ పూర్తయిన తరువాత ప్రస్తుత అధ్యక్షుడు, త్వరలో ప్రమాణం చేయనున్న అధ్యక్షుడికి ఆతిథ్యం ఇవ్వడం సంప్రదాయంగా వస్తోంది. అందులో భాగంగానే జో బైడెన్, ట్రంప్​నకు ఓవల్ ఆఫీస్​లో ఆతిథ్యం ఇచ్చారు. అయితే 2020లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ట్రంప్​, అప్పుడు గెలుపొందిన డెమొక్రాట్​ పార్టీ అభ్యర్థి అయిన జో బైడెన్​కు అతిథ్యం ఇవ్వకపోవడం గమనార్హం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.