ETV Bharat / state

పిల్లలను దత్తత తీసుకోవాలనుకుంటున్నారా? - ఈ విషయాలు పూర్తిగా తెలుసుకుంటే బెటర్! - Child Adoption Rules in Telugu

Child Adoption Rules : ఈ తరం దంపతులు సంతానలేమి సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. జీవనశైలిలో వచ్చిన మార్పులు, ఆరోగ్య సమస్యలతో పాటు ఆహారపు అలవాట్లూ దీనికి కారణమవుతున్నాయి. ఇలా సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్న వారిలో చాలా మంది పిల్లలను దత్తత తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ క్రమంలో దత్తత ప్రక్రియను పూర్తిగా తెలుసుకుని, పలు అంశాల గురించి ముందుగానే అవగాహన తెచ్చుకుని, ఇందుకోసం మానసికంగా పూర్తి సంసిద్ధంగా ఉండాలని సూచిస్తున్నారు.

Precautions to be Taken Before Adopting a Child in Telugu
Precautions to be Taken Before Adopting a Child in Telugu (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 24, 2024, 12:11 PM IST

Precautions to be Taken Before Adopting a Child in Telugu : పిల్లలను అనాథాశ్రమం నుంచి లేదా ఇతరుల నుంచి దత్తత తీసుకునేందుకు ఓ ప్రక్రియ ఉంటుంది. అందులో కొన్ని న్యాయపరమైన అంశాలు ఉంటాయి. భవిష్యత్తులో ఎలాంటి చిక్కులు రాకుండా ఉండేందుకు ఈ అంశాల పట్ల పూర్తి అవగాహన ఉండాలి. అవసరాన్ని బట్టి లాయర్‌ను కూడా సంప్రదించవచ్చు. దీనికంటే ముందుగా దత్తత తీసుకునే ప్రక్రియ గురించి పూర్తిగా తెలుసుకుంటే మంచిది.

పిల్లలను దత్తత తీసుకునే విషయం గురించి ముందుగా భార్యాభర్తలిద్దరూ చర్చించుకోవాలి. భవిష్యత్తులో ఏవైనా సమస్యలు వస్తే, వాటిని ఎదుర్కొనేందుకు ముందుగా సిద్ధమవ్వాలి. అయితే ఈ విషయంలో కుటుంబసభ్యుల అభిప్రాయం తీసుకోవాలి. దీనిపై కుటుంబ సభ్యులకు భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు. కానీ వారి సందేహాలను సాధ్యమైనంత వరకు నివృత్తి చేసి, ఏకాభిప్రాయానికి వచ్చే వరకు సముదాయించాలి. దీంతో భవిష్యత్తులో సమస్యలు వచ్చే అవకాశమూ తక్కువగా ఉంటుంది.

హెచ్చరిక : పసి పిల్లలను అలా కొనుక్కోవడం "నేరం" - ఇలా తెచ్చుకోవడమే "న్యాయం"! - Child Adoption Rules

అనుబంధాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోవాలి : చాలా మంది పిల్లలు కొత్తవారితో కలిసిపోలేరు. అలాగే చాలా మందికి దత్తత తీసుకున్న తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన ఉండకపోవచ్చు. దీని గురించి ఎవరు ఎన్ని జాగ్రత్తలు చెప్పినా, స్వయంగా అనుభవం ఉన్నవారికే పూర్తి వివరాలు తెలుస్తాయి. వారి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తెలుసుకోవడం ఉత్తమం. దాంతో పిల్లలతో అనుబంధాన్ని ఎలా పెంచుకోవాలో, వారితో ఎలా మెలగాలో తెలుసుకోవచ్చు. ఫలితంగా దత్తత విషయంలో ముందుగానే ఒక స్పష్టమైన అభిప్రాయానికి వస్తారు.

అవసరాన్ని వివరించాలి : కొంతమంది దంపతులు ఈపాటికే తమకు పిల్లలున్నా, ఆడపిల్లనో లేదా మగపిల్లవాడు కావాలనో దత్తత తీసుకోవాలి అనుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో మీ పాప/ బాబు కొత్తగా వచ్చేవారితో అంత తొందరగా కలిసిపోలేరు. వారికి చెల్లి/ తమ్ముడు ఉంటే ఎంత మంచిదో వివరించాలి. ఇలా చేయడం వల్ల చిన్నప్పటి నుంచే ఇద్దరూ తోబుట్టువుల్లా కలిసిమెలిసి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఆర్థికంగా స్థిరంగా ఉంటేనే : కుటుంబంలోకి కొత్తగా ఒకరు అడుగుపెట్టారంటే ఖర్చు కూడా పెరుగుతుంది. కాబట్టి దీనికి ముందుగా ఆర్థికంగా కూడా సిద్ధమవ్వాలి. కొత్తగా వచ్చే బిడ్డకు సంబంధించి ఖర్చు విషయంలో మీకు వచ్చే ఇన్‌కమ్​ను బట్టి ముందు నుంచే ప్లాన్‌ చేసుకోవాలి. ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందీ లేకపోతేనే దత్తత తీసుకోవడానికి ముందుకు వెళ్లాలి. అలాగే ఆడపిల్ల/ మగపిల్ల ఇలా ఎవరిని దత్తత తీసుకోవాలనే విషయంలో కూడా ముందుగానే ఒక నిర్ణయానికి రావాలని నిపుణులు అంటున్నారు. అదేవిధంగా దత్తత తీసుకునే పిల్లల ఆరోగ్యం ఎలా ఉందో ముందే తెలుసుకోవడం బెటర్​ అని నిపుణులు సూచిస్తున్నారు.

పాప కావాలి.. దత్తతలో ఆడపిల్లలదే అగ్రస్థానం

Child Adoption in Telangana : కంటిపాపల్లా పెంచుకుంటాం.. కన్నప్రేమను పంచుతాం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.