Devara Movie Theme : "కులం లేదు, మతం లేదు, భయం అసలే లేదు. ధైర్యం తప్ప ఏమీ తెలియని కళ్లలో, మొదటి సారి భయం పొరలు కమ్ముకున్నాయి. రక్తంతో సంద్రమే ఎరుపెక్కిన కథ, మా దేవర కథ", "మనిషికి బ్రతికేంత ధైర్యం చాలు. చంపేంత ధైర్యం కాదు. కాదు కూడదు అని మళ్లీ మీరు ఆ ధైర్యాన్ని కూడగడితే, ఆ ధైర్యాన్ని చంపే భయాన్ని అవుతా" అంటూ ట్రైలర్లో దేవరను ఎలివేట్ చేస్తూ వచ్చే సంభాషణలు ఫ్యాన్స్‌లో గూస్బంప్స్ తెప్పించిన సంగతి తెలిసిందే.
ఈ డైలాగ్స్, ప్రచార చిత్రం చూస్తే సినిమా పక్కా యాక్షన్ మోడ్‌తో ధైర్యం, భయం అనే కాన్సెప్ట్‌తో కథ సాగుతున్నట్లు కనిపిచ్చింది. సాధరణంగా అందరూ ధైర్యాన్ని సానుకూలంగా, భయాన్ని ప్రతికూలంగా చూస్తుంటారు. కానీ, దేవరలో ధైర్యం కన్నా భయాన్ని హైలైట్ చేసి చూపించారు కొరటాల. బాధ్యతతో కూడిన భయం మంచిదే అని, భయమే మనిషిని సరైన దారిలో నడిపిస్తుందనే విషయాన్ని చూపించారు.
Devara Koratala Siva : అయితే తాజాగా ఇదే విషయాన్ని స్వయంగా చెప్పారు కొరటాల. దేవర మెయిన్ థీమ్ కూడా ఇదేనని క్లారిటీ ఇచ్చారు. "మనిషికి ధైర్యం అవసరం. కానీ మితిమీరిన ధైర్యం అస్సలు మంచిది కాదు. అది మూర్ఖత్వానికి, విధ్వంసానికి కారణం అవుతుంది. అందుకే మనలో దాగి ఉన్న భయాన్ని గౌరవించాలి. అది ప్రతిఒక్కరికీ మంచిది. ఎవరైనా భయం ఉండకూడదని చెబితే అది తప్పు అని నా అభిప్రాయం. ట్రాఫిక్‌లో రెడ్ సిగ్నల్ పడేటప్పుడు ఎవరైనా ఆగుతున్నారంటే అది ఓ భయం వల్లే. లేదంటే ఎవరూ ఆగరు కదా. భయమే మనిషిని సరైన దారిలో నడిపిస్తుందని నేను నమ్ముతాను. దీనినే 'దేవర'లో గట్టిగా చూపించాను. దేవర మెయిన్ థీమ్ ఇదే." అని కొరటాల చెప్పుకొచ్చారు.
రెండు భాగాలుగా అందుకే(Devara Second Part) : దేవరను రెండు భాగాలుగా తీయలని ముందుగానే నిర్ణయించుకున్నట్లు తెలిపారు కొరటాల. ఎందుకంటే ఈ కథ చెప్పడానికే తనకు 4గంటలు పట్టిందని, దాన్ని తెరపైకి తీసుకొస్తే మొత్తం 6 గంటల కథ అవుతుందని పేర్కొన్నారు. ఇంత పెద్ద కథను ఒకే భాగంలో తెరకెక్కించడం చాలా కష్టమని, అందుకే రెండు భాగాలు తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. రెండో భాగంతో సినిమా పూర్తైపోతుందని క్లారిటీ ఇచ్చారు.
దేవర 2 భాగాన్ని మళ్లీ ఎన్టీఆర్ అందుబాటులో ఉన్నప్పుడే ఉంటుందని చెప్పారు కొరటాల. ప్రస్తుతం తారక్ పూర్తి చేయాల్సిన సినిమాలు కొన్ని ఉన్నాయని, అవి పూర్తవ్వగానే దేవర రెండో భాగం ఉంటుందని పేర్కొన్నారు.
కాగా, 'దేవర' మొదటి భాగం రాకకు మరో రెండు రోజులే సమయం ఉండడంతో ఎక్కడ చూసిన ఈ సినిమా పేరు కనిపిస్తోంది, వినిపిస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ఇతర ప్రచార చిత్రాలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వ్యూస్ పరంగా ఇవి పలు రికార్డులను కూడా క్రియేట్ చేశాయి.
'దేవర' రన్‌టైమ్‌లో 8 నిమిషాలు ట్రిమ్! - సినిమా నిడివి ఎంతంటే? - Devara Movie RunTime