Pakistan Social Media Ban : పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొహర్రం సందర్భంగా ద్వేషపూరిత విషయాలను నియంత్రించేందుకు జులై 13-18 వరకు ఆరు రోజులపాటు సోషల్ మీడియా వేదికలన్నింటిపై బ్యాన్ విధించింది. యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, టిక్‌టాక్ వంటి యాప్స్‌పై ఆరు రోజుల పాటు నిషేధం ఉండనుంది.
6రోజులు సోషల్ మీడియా మొత్తం బ్యాన్- ప్రభుత్వం కీలక నిర్ణయం- ఎందుకంటే?
Published : Jul 5, 2024, 10:22 AM IST
మతపరమైన హింసను నివారించడానికి, తప్పుడు సమాచారాన్ని అరికట్టడానికి, విద్వేషపూరిత విషయాలను నియంత్రించడానికే సోషల్ మీడియాపై బ్యాన్ విధించామని పంజాబ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్‌పై పాక్ ప్రభుత్వం నిషేధం విధించింది. ఇటీవలే సోషల్ మీడియాపై పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియాను విషపూరిత మీడియాగా అభివర్ణించారు. అలాగే డిజిటల్ టెర్రరిజంతో పోల్చారు.