ETV Bharat / health

ప్రతి రోజు భోజనంలో పెరుగు తింటున్నారా? అయితే, ఈ విషయాలు తప్పక తెలుసుకోండి! - HEALTH BENEFITS OF CURD

-పెరుగును తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు -ఎముకల బలంతో పాటు గుండె ఆరోగ్యం మెరుగు!

Health Benefits of Curd
Health Benefits of Curd (Getty Images)
author img

By ETV Bharat Health Team

Published : Nov 24, 2024, 1:23 PM IST

Health Benefits of Curd: మనలో చాలా మందికి భోజనంలో ఎన్ని రకాల వంటకాలు, సైడ్‌ డిష్‌లు ఉన్నా సరే చివరగా కొద్దిగా పెరుగుతో తింటేనే భోజనం పూర్తి చేశామన్న సంతృప్తి కలుగుతుంది. డైరీ ఉత్పత్తుల్లో ఒకటైన పెరుగును రోజు తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పెరుగును తినడం వల్ల అనేక పోషకాలు లభించడంతో పాటు చర్మారోగ్యంతో పాటుగా, జీర్ణ వ్యవస్థ పనితీరు కూడా మెరుగవుతుందని వివరించారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎముకలు, దంతాలు బలం: పెరుగులో అధికంగా ఉండే కాల్షియం, పాస్పరస్‌లు ఎముకల బలానికి ఉపయోగపడతాయని ప్రముఖ పోషకాహర నిపుణులు డాక్టర్ లహరి సూరపనేని వెల్లడించారు. పళ్లు, ఎముకల బలంగా ఉండేందుకు అవసరమైన కాల్షియం లాంటి ఖనిజాలు పెరుగులో ఎక్కువగా లభిస్తాయని వివరించారు. ఇలా పెరుగును రెగ్యులర్​గా తీసుకోవడం వల్ల ఎముకల బలంగా తయారై ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్ లాంటి వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చని అంటున్నారు.

గుండె ఆరోగ్యం మెరుగు: పెరుగు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండెను ఆరోగ్యంగా ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇంకా రక్త పోటును కూడా అదుపులో పెట్టి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుందని వివరించారు.

బరువు తగ్గడానికి: బరువు తగ్గాలని అనుకునేవారు పెరుగును తమ డైట్​లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇది జీవక్రియలను మెరుగుపరిచి బరువు అదుపులో ఉంచేలా చూస్తుందన్నారు. ఇందులో ఉండే అధిక ప్రోటీన్లు ఎక్కువ సేపు ఆకలి కాకుండా చేస్తుందని.. ఫలితంగా తక్కువ ఆహారాన్ని తీసుకుంటామని వివరించారు.

జీర్ణక్రియ సక్రమంగా: పెరుగులో ఉండే ప్రోబయాటిక్స్ జీర్ణక్రియను సక్రమంగా నడవడంలో సాయపడుతుందని నిపుణులు అంటున్నారు. జీర్ణక్రియ వేగవంతం చేసి ఆహారంలోని పోషకాలను శరీరానికి వేగవంతంగా అందేలా చేస్తుందని వివరించారు. ఇంకా మలబద్దకం, డయేరియా, ఉబ్బరం లాంటివి లేకుండా చేయడంలో పెరుగు కీలక పాత్ర పోషిస్తుందని వెల్లడించారు.

రోగ నిరోధక వ్యవస్థ కోసం: మానవ శరీరానికి అవసరమైన రోగనిరోధక శక్తిని అందించే బెస్ట్ ప్రోబయోటిక్ ఫుడ్స్‌లో పెరుగు ఒకటని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరానికి సరిపడా శక్తి, సామర్థ్యాన్ని పెంచి మెటబాలిజాన్ని మెరుగు పరుస్తుందని వెల్లడించారు. ఫలితంగా ఇమ్యూనిటీ పవర్ పెరిగి రోగాలు ఉంటుందని వివరించారు.

జుట్టు ఆరోగ్యం: పెరుగులో ఉండే విటమిన్లు, ప్రోటీన్లు, ఖనిజాలు, లాక్టిక్ యాసిడ్ జుట్టు కుదుళ్లను బలంగా చేస్తుందని నిపుణులు వెల్లడించారు. ఫలితంగా జుట్టు రాలకుండా, దృఢంగా పెరిగేలా చేస్తుందని వివరించారు. ఇంకా చర్మ సంరక్షణకు కూడా పెరుగు బాగా ఉపయోగపడుతుందన్నారు. ఇందులో ఉండే విటమిన్ ఈ, జింక్ లాంటి పోషకాలు చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యవంతంగా మారుస్తాయని పేర్కొన్నారు.

షుగర్ పేషంట్లకు బెస్ట్: మధుమేహం రోగులకు పెరుగు మంచి ఔషధంలా పనిచేస్తుందని నిపుణులు అంటున్నారు. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని వివరించారు. ఇంకా గ్లూకోజ్ స్థాయులను నిలకడగా ఉంచి.. షుగర్​ను అదుపులో ఉంచుతుందన్నారు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

కూరల్లో పసుపు వేస్తున్నారా? అతిగా వాడితే అనేక వ్యాధులు వస్తాయట జాగ్రత్త! మరి ఎంత వేయాలి?

బీర్ ఆరోగ్యానికి మంచిదా? ఈ 6 విషయాలు మీరు తప్పక తెలుసుకోవాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.