Russian President Putin Visit To India : రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ త్వరలో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆ దేశ అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ పేర్కొంది. పర్యటన తేదీలపై భారత్‌తో చర్చిస్తున్నామని తెలిపింది. పుతిన్ భారత పర్యటన ఖరారైతే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇదే తొలిసారి కానుంది. గత నెలలో బ్రిక్స్ సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో సమావేశమైన మోదీ, వచ్చే ఏడాది జరగనున్న 23వ భారత్-రష్యా వార్షిక సదస్సుకు రావాలని ఆహ్వానించారు. ఈ ఏడాది ఇప్పటికే ఇరువురు నేతలు రెండు సార్లు సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఉక్రెయిన్‌తో వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మోదీ ఇప్పటికే పలుమార్లు సూచించారు. ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించడానికి సహకారం అందిస్తామని అన్నారు. అందులో భాగంగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోభాల్‌ను మాస్కోకు పంపించారు.
త్వరలో భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్!
Published : 18 hours ago
|Updated : 17 hours ago