ETV Bharat / sports

ఫుట్​బాల్ లవర్స్​కు గుడ్​ న్యూస్​ - భారత్​లో సాకర్‌ స్టార్‌ లియెనల్‌ మెస్సీ మ్యాచ్ - ARGENTINA FOOTBALL TEAM KERALA

భారత ఫుట్‌బాల్ అభిమానులకు, మరీ ముఖ్యంగా కేరళ ఫుట్​ బాల్ ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్.

Lionel Messi to play in Kerala
Lionel Messi to play in Kerala (source Associated Press and Getty Images)
author img

By ETV Bharat Sports Team

Published : Nov 20, 2024, 11:03 AM IST

Argentina National Football Team to play In Kerala : ఫుట్‌బాల్‌ అంటే మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆదరణ ఉంది. ముఖ్యంగా కేరళ, పశ్చిమ్‌ బంగ వాసులకు ప్రత్యేక అభిమానం. ఫుట్​బాల్​ మ్యాచ్​లకు ఆ రాష్ట్రాల్లో సందడి మామూలుగా ఉండదు. ఎక్కడ చూసినా రొనాల్డో నిలువెత్తు కటౌట్లు, మెస్సీ ఫ్లెక్సీలు, నెయ్‌మార్‌ బ్యానర్లు, ప్రపంచకప్ ట్రోఫీలు దర్శనమిస్తున్నాయి. అభిమాన ఆటగాళ్ల జెర్సీలు ధరించి మలయాళీలు, ఫుట్‌బాల్‌ఫై తమకున్న ప్రేమను చాటుకుంటుంటారు.

Lionel Messi to play in Kerala : అయితే తాజాగా భారత ఫుట్‌బాల్ అభిమానులకు, మరీ ముఖ్యంగా కేరళ ఫుట్​ బాల్ ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్ అందింది​. వారి నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. అర్జెంటీనా ఫుట్‌ బాల్ జట్టు 2025లో కేరళ వేదికగా ఓ అంతర్జాతీయ మ్యాచ్​ ఆడేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని కేరళ క్రీడా శాఖ మంత్రి వి.అబ్దురహిమన్​ తెలిపారు. అర్జెంటీనా ఫుట్​ బాల్ జట్టుతో పాటు లెజండరీ ప్లేయర్​ లియోనాల్ మెస్సీ కూడా తమ రాష్ట్రానికి వచ్చి మ్యాచ్ ఆడుతాడని పేర్కొన్నారు. ఈ మ్యాచ్ నిర్వహణ కోసం అవసరమైన నిధులను స్పాన్సర్‌షిప్ ద్వారా అందించనున్నట్లు తెలుస్తోంది.

ఈ అంతర్జాతీయ మ్యాచ్​ను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పర్యవేక్షణలో జరగనుందని చెప్పారు కేరళ క్రీడా శాఖ మంత్రి అబ్దురహిమన్​. "ఈ హై ప్రొఫైల్​ ఫుట్​ బాల్ ఈవెంట్ నిర్వహించేందుకు కావాల్సిన మొత్తం ఖర్చును ​ రాష్ట్రానికి సంబంధించిన మెర్చంట్స్​ ద్వారా అందించబడుతుంది." అని క్రీడా శాఖ మంత్రి అన్నారు. ఈ ప్రతిష్టాత్మక ఫుట్ బాల్​ ఈవెంట్​ను సమర్థవంతంగా నిర్వహిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.

కాగా, కేరళలో జరిగే అంతర్యాతీయ మ్యాచ్‌లో అర్జెంటీనా జట్టు ఎవరిని ఢీ కొంటుంది అనే దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఫిఫా టాప్ 50లో ఉన్న జట్టుతో అర్జెంటీనా తలపడనుందని సమాచారం అందుతోంది. జపాన్ (15), ఇరాన్ (19), దక్షిణ కొరియా (22), ఆస్ట్రేలియా (24), ఖతార్ (46) ర్యాంకింగ్‌లో ముందున్నాయి.

ఓటమితో ముగిసిన రఫెల్ నాదల్ కెరీర్

బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ - ఆసీస్​ గడ్డపై కోహ్లీ, రోహిత్​ రికార్డులు ఎలా ఉన్నాయంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.