Vijay Sethupathi Maharaja Movie China Release : తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కెరీర్లో 50వ సినిమాగా వచ్చి ఓ మైలురాయిగా నిలిచిపోయింది మహారాజా చిత్రం. బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.100 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం భారతీయ సినీ ప్రేక్షకులకు సూపర్ థ్రిల్‌ను పంచింది. ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా, ఆసాంతం ఉత్కంఠభరితంగా సాగేలా తెరకెక్కించారు. ముఖ్యంగా సినిమాలో విజయ్ సేతుపతి నటనకు మంచి మార్కులు పడ్డాయి. కథకు విజయ్ నటనే ప్లస్ పాయింట్ అని సినీ ప్రియులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
అయితే ఇప్పుడీ సినిమా చైనాలోనూ అదరగొట్టేందుకు రెడీ అవుతోందని తెలిసింది. ఏకంగా అక్కడ 40 వేల స్క్రీన్లలో రిలీజ్ కానుందట. సాధారణంగా భారత్‌లో బ్లాక్ బస్టర్ అందుకున్న చిత్రాలను చైనాలో రిలీజ్ చేయడం చూస్తూనే ఉంటాం. అయితే ఈ సారి మహారాజా చిత్రాన్ని ఏకంగా 40 వేల స్క్రీన్లలో రిలీజ్ చేయబోతుండం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇది సాధరణ విషయం కాదనే చెప్పాలి. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో జోరుగా ప్రచారం సాగుతోంది. బయట కథనాలు కూడా కనిపిస్తున్నాయి. యి షి ఫిల్మ్స్, అలీబాబా పిక్చర్స్ సంయుక్తంగా చైనాలో మహారాజా చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాయట. నవంబర్ 29న ఈ సినిమా విడుదల కానుంది. చూడాలి మరి చైనా ఆడియెన్స్ ఈ చిత్రాన్ని ఎలా ఆదరిస్తారో.
కాగా, మహారాజా మూవీ కేవలం రూ.20 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన బాక్సాఫీస్ దగ్గర దాదాపు రూ.107 కోట్ల గ్రాస్ కలెక్షన్లను అందుకుంది. ఓ సింపుల్ రివేంజ్ స్టోరీకి, ప్రేక్షకుల ఊహకందని ట్విస్టులు ఇస్తూ మహారాజా చిత్రాన్ని దర్శకుడు నిథిలన్ సామినాథన్ అద్భుతంగా తెరకెక్కించారు. సినిమాలో విలన్‌గా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కనిపించారు. ఈ సినిమా ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఓటీటీలోనూ అదిరే రెస్పాన్స్‌ను అందుకుందీ చిత్రం.