తెలంగాణ

telangana

వరదల్లో మునిగిన నార్త్ కొరియా - బాధితుల్ని పరామర్శించిన కిమ్

By ETV Bharat Telugu Team

Published : Aug 10, 2024, 10:25 AM IST

North Korea Floods
North Korea Floods (Associated Press)

North Korea Floods : నియంతగా పేరుగాంచిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ వ్యవహార శైలిలో మార్పు కనిపిస్తోంది. ఇటీవల ఉత్తర కొరియాలోని పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకోగా, స్వయంగా వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొన్న కిమ్ తాజాగా వరదల్లో నిరాశ్రయులైన బాధితుల్ని పరామర్శించారు. సహాయక శిబిరాలకు వెళ్లి అక్కడి సౌకర్యాలను పరిశీలించారు. పలువురు బాధితుల వద్దకు వెళ్లిన కిమ్ వారిని ఆప్యాయంగా పలకరించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉత్తర కొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(KCNA) విడుదల చేసింది. తర్వాత ఓ రైలులో నిల్చుని కిమ్ ప్రసంగించారు. వరద బాధితులకు అవసరమైన ఆహార సామగ్రిని అందించారు. చైనాతో సరిహద్దు ఉన్న ఉత్తరకొరియా ప్రాంతాల్లో ఇటీవల భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. ఈ కారణంగా 4,100 ఇళ్లు ధ్వంసమయ్యాయి. 7,410 ఎకరాల మేర పంటకు నష్టం వాటిల్లింది.

ABOUT THE AUTHOR

...view details