ETV Bharat / state

నిజం నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా - అసలు ఘటన జరిగిందనడానికి సాక్ష్యమేంటి : జానీ మాస్టర్‌ సతీమణి - Jani Master Wife about Arrest

Jani Master wife on Rape Case : తన భర్త, జానీ మాస్టర్‌ ప్రతిభను ప్రోత్సహించేవారని, ఎవరికైనా అవకాశాల్లేకుండా ఎందుకు చేస్తారని సుమలత అలియాస్‌ ఆయేషా అన్నారు. గురువారం ఓ మీడియాతో మాట్లాడిన ఆయేషా, ఆమె నిజం నిరూపిస్తే జానీ మాస్టర్​ను వదిలేస్తానని వెల్లడించారు. ఒకవేళ లైంగిక వేధింపులకు గురైతే జానీ మాస్టర్‌ వద్ద పని చేయడం తన అదృష్టం అని నవ్వుతూ ఎందుకు చెబుతోందని ప్రశ్నించారు.

Choreographer Jani Master Wife Challenges to Victim
Jani Master wife on Rape Case (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2024, 10:46 PM IST

Choreographer Jani Master Wife Challenges to Victim : తన భర్త, జానీ మాస్టర్‌ ప్రతిభను ప్రోత్సహించేవారని, ఎవరికైనా అవకాశాలు రాకుండా ఆయనెందుకు చేస్తారని సుమలత అలియాస్‌ ఆయేషా అన్నారు. అసిస్టెంట్‌ కొరియోగ్రాఫర్‌పై అత్యాచారం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జానీ మాస్టర్‌ను రాజేంద్రనగర్ ఎస్​ఓటీ పోలీసులు గురువారం గోవాలో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ భార్య ఓ మీడియాతో మాట్లాడారు. ఫిర్యాదు చేసిన మహిళ నిజం నిరూపిస్తే భర్తను వదిలేస్తానని ఆయేషా వెల్లడించారు.

హీరోయిన్‌గా స్థిరపడాలి లేదా కొరియోగ్రాఫర్‌గా అగ్ర స్థానంలో ఉండాలనేది ఆ అమ్మాయి, ఆమె తల్లి కోరిక అని ఆయేషా తెలిపారు. స్టేజ్‌ షోల నుంచి వచ్చిన ఆమె, సినీ రంగాన్ని చూసి లగ్జరీ లైఫ్‌ కావాలని కోరుకునేదని చెప్పారు. తనకే ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వాలని చూస్తుంటుందని పేర్కొన్నారు. మైనర్‌గా ఉన్నప్పుడే ఘటన జరిగిందనడానికి సాక్ష్యమేంటని, జానీ మాస్టర్‌తో సాన్నిహిత్యంగా ఉందని ఎవరైనా చూశారా అని ప్రశ్నించారు. ఇప్పటి వరకూ ఆ అమ్మాయి బయటకొచ్చి మాట్లాడిందా అని అన్నారు.

లైంగిక వేధింపులకు గురైతే ఎందుకు అలా చెప్పింది : అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసినప్పుడు మాట్లాడటానికి ఏమైందని, ఒకవేళ లైంగిక వేధింపులకు గురైతే ‘జానీ మాస్టర్‌' వద్ద పని చేయడం తన అదృష్టమని నవ్వుతూ ఎందుకు చెబుతోందని ఆయేషా ప్రశ్నించారు. ఆ మాట చెప్పినప్పుడు ఆమె ఇబ్బంది పడినట్లు కనిపించలేదని తెలిపారు. హైదరాబాద్‌లో అసోషియేషన్‌ కార్డు పొందేందుకు ఆమె దగ్గర డబ్బులేకపోతే జానీ మాస్టర్‌యే ముంబయిలో ఇప్పించారని చెప్పారు. తన భర్త పని చేసిన సినిమాలో కొరియోగ్రాఫర్‌గా కూడా ఆమెకు అవకాశం ఇచ్చారని వెల్లడించారు.

అసలేంటీ వివాదం : ప్రముఖ కొరియోగ్రాఫర్​ జానీ మాస్టర్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, అత్యాచారం చేశాడంటూ అసిస్టెంట్​ కొరియోగ్రాఫర్​గా పనిచేస్తున్న ఓ మహిళ రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జానీ మాస్టర్‌పై రాయదుర్గం పోలీస్​స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసులు మొదట జీరో ఎఫ్​ఐఆర్ నమోదు చేయగా అనంతరం కేసును నార్సింగి పీఎస్‌కు బదిలీ చేశారు. కాగా ఈ ఘటనపై నార్సింగి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నార్సింగి పోలీసు స్టేషన్​లో 372(2)(N), 506, 323 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇవాళ జానీ మాస్టర్​ను గోవాలో పోలీసులు అరెస్టు చేశారు.

'నిజం ఎప్పటికైనా బయటపడుతుంది' : జానీ మాస్టర్ వ్యవహారంపై మనోజ్ కీలక వ్యాఖ్యలు - Manchu Manoj Reacts On Jani Master

అసిస్టెంట్​పై అత్యాచారం ఆరోపణలు - గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్ - JANI MASTER ARRESTED TODAY

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.