Google Chrome Listen to This Page Feature: వార్తల కోసమో, సమాచారం కోసమో నిత్యం వివిధ వెబ్‌సైట్‌లలో కంటెంట్ చదువుతూం ఉంటాం. ఎక్కువసేపు చదవాల్సిన సందర్భంలో, ప్రయాణ సమయంలో వార్తలను చదివేందుకు వీలుపడదు. అలాంటి సందర్భాల్లో ఎవరైనా కంటెంట్‌ను ‘చదివి వినిపిస్తే బాగుండు అని అనిపిస్తుంది. అయితే అలాంటివారు ఇకపై వార్తలను గూగుల్ క్రోమ్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ ద్వారా వినొచ్చు. ఆండ్రాయిడ్‌లో గూగుల్ క్రోమ్ వాడుతున్న యూజర్స్ ఇక వెబ్‌పేజీలను చదవాల్సిన అవసరం లేకుండా క్రోమ్ బ్రౌజరే చదివి వినిపిస్తుంది. మరి దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
గూగుల్ క్రోమ్‌లో ఈ ఫీచర్‌ను యాక్టివేట్ చేసుకోవటం ఎలా?:
- ఏదైనా పేజీలో లాంగ్ ఆర్టికల్ చదవాల్సిన సందర్భంలో గూగుల్ తీసుకొచ్చిన 'లిజన్ టు దిస్ పేజ్' ఫీచర్ ఉపయోగపడుతుంది.
- మొదట్లో ఇంగ్లిష్‌తో పాటు కొన్ని భాషలకే పరిమితమైన ఈ ఫీచర్ ఇప్పుడు తెలుగులోనూ లభిస్తోంది.
- దీంతో ఇకపై మీకు నచ్చిన కంటెంట్‌ను ఎంచక్కా హెడ్‌ఫోన్స్ పెట్టుకుని వినొచ్చు.
- ఉదాహరణకు ఈటీవీ భారత్ వెబ్‌సైట్‌లోని ఇదే వార్తను మీరు వినాలనుకుంటే మీ క్రోమ్ బ్రౌజర్‌లోని త్రీడాట్స్ మెనూపై క్లిక్ చేసి 'లిజన్ టు దిస్ పేజ్' ఆప్షన్‌ను సెలక్ట్ చేసుకోండి.
- దానిపై క్లిక్ చేయగానే మొదటి నుంచి చివరి వరకు ఆ పేజీలో మొత్తం టెక్ట్స్‌ను మీ వాయిస్ అసిస్టెంట్ చదివి వినిపిస్తుంది.
- వాయిస్ అసిస్టెంట్ చదువుతున్నప్పుడు కంటెంట్‌లో ఏ పేరా చదువుతుందో కూడా మనకు కనిపిస్తుంది.
- కావాలంటే ఆడియో ఫాస్ట్ ఫార్వర్డ్/ బ్యాక్‌వర్డ్ చేసుకోవచ్చు.
- మేల్/ ఫీమేల్ వాయిస్‌ను మార్చచుకోవచ్చు.
- కంటెంట్‌ను వేగంగా వినాలనుకుంటే 1X, 1.5X, 2X.. ఇలా స్పీడ్‌ను కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
- మధ్యలో మీరు ఎవరితోనైనా మాట్లాడాలనుకుంటే పాజ్ చేసి తర్వాత మళ్లీ ప్లే చేసి కొనసాగించొచ్చు.
- మీరు కంటెంట్‌ను వినే సమయంలో స్క్రీన్ ఆన్‌లో ఉంచాల్సిన అవసరం కూడా లేదు. బ్యాగ్రౌండ్‌లోనూ దీన్ని ప్లే చేసుకోవచ్చు.
- ఇకపై వెబ్సైట్ కంటెంట్ వినాలనుకునేవారు గూగుల్ క్రోమ్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను ట్రై చేయండి!
ఐఫోన్ లవర్స్‌కు అమెజాన్ బంపర్ ఆఫర్- రూ.39,999లకే యాపిల్ ఐఫోన్ 13! - iPhone 13 for Rs 39999