ETV Bharat / sports

సూపర్ సెంచరీతో ధోనీ రికార్డ్ సమం - ఆ విషయంలో తలా కంటే అశ్విన్ ఎక్కువే! - Ashwin Test Record - ASHWIN TEST RECORD

Ashwin Test Record : టీమ్ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ గురువారం బంగ్లాతో జరిగిన టెస్టులో శతకంతో ఆకట్టుకున్నాడు. దీంతో అశ్విన్ దిగ్గజ క్రికెటర్ ధోనీ రికార్డును సమం చేశాడు.

Ashwin Test Record
Ashwin Test Record (Source : Getty Images (Left), Associated Press (Right))
author img

By ETV Bharat Sports Team

Published : Sep 19, 2024, 10:48 PM IST

Ashwin Test Record : భారత్ - బంగ్లాదేశ్ మధ్య జరుగుతున్న టెస్టు మ్యాచ్​లో టీమ్ఇండియా ఆల్​రౌండర్ శతకం (102 పరుగులు)తో అదరగొట్టాడు. అతడు 108 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్​లతో సెంచరీ నమోదు చేశాడు. కాగా, అశ్విన్​కు టెస్టుల్లో ఇది ఆరో సెంచరీ. అలాగే చెన్నై చెపాక్ స్టేడియంలో రెండోది కావాడం విశేషం. అయితే ఈ సూపర్ ఇన్నింగ్స్​తో అశ్విన్, టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రికార్డు సమం చేశాడు.

దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు కెరీర్​లో 6 సెంచరీలు చేశాడు. తాజా శతకంతో అశ్విన్, ధోనీ రికార్డును సమం చేశాడు. అశ్విన్ 101 మ్యాచ్​ల్లో 6 శతకాలు నమోదు చేయగా, ధోనీ 90 మ్యాచ్​ల్లో 6 సెంచరీలు బాదాడు. ఇందులో ధోనీ కంటే అశ్విన్​ విదేశాల్లో ఎక్కువ సెంచరీలు నమోదు చేశాడు. అశ్విన్​ ఓవర్​సీస్​లో 2 శతకాలు చేయగా, ధోనీ 1 సెంచరీ బాదాడు.

ఎలైట్ క్లబ్‌లో అశ్విన్
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC)లో 100 వికెట్లు, 1,000 పరుగులు చేసిన రెండో ఆటగాడిగా అశ్విన్ నిలిచాడు. ఈ రికార్డు అందుకున్న తొలి ఆటగాడు జడేజా కావడం గమనార్హం.

ఆదుకున్న అశ్విన్, జడ్డూ
ఇక మ్యాచ్ విషయానికొస్తే, 144 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన కష్టాల్లో పడ్డ టీమ్ఇండియాను జడేజా, అశ్విన్ ఆదుకున్నారు. స్కోర్ 200 అయినా దాటుతుందా అన్న దశలో నుంచి భారత్​కు 300+ స్కోర్ అందించారు. వీరిద్దరూ వీరిద్దరూ 7వ వికెట్​కు భారీ 195 పరుగులు అజేయ భాగస్వామ్యం నెలకొల్పి భారత్​కు భారీ స్కోర్ అందించారు. రోహిత్, గిల్, విరాట్ లాంటి స్టార్లు ఈ పిచ్​పై పరగులు చేయడానికి కష్టపడితే ఈ ఆల్​రౌండర్లు భారీ స్కోర్లతో బంగ్లా బౌలర్లకు ఎదురు నిలిచారు. ఎలాంటి ప్రయోగాత్మక షాట్లకు పోకుండా నిలకడతా ఆడారు. ఇక తొలి రోజు ఆట ముగిసేసరికి టీమ్ఇండియా 339/6 (80 ఓవర్లు) స్కోర్ చేసింది. క్రీజులో అశ్విన్ (102*), రవీంద్ర జడేజా (86* పరుగులు) ఉన్నారు. బంగ్లా బౌలర్లలో హసన్ మహ్మద్ 4, నహీద్ రానా, మెహెదీ హసన్ మిరాజ్ తలో వికెట్ దక్కించుకున్నారు.

అశ్విన్ అదరహో - సెంచరీతో బంగ్లా బౌలర్లకు చెక్ - Ind vs Ban Test Series 2024

అశ్విన్, జడ్డు 'ది సేవియర్స్'- దెబ్బకు 24ఏళ్ల రికార్డు బ్రేక్ - Ind vs Ban Test Series 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.