ETV Bharat / health

మితిమీరిన కోపంతో మీ గుండెకు ప్రమాదమా?- పరిశోధనలు ఏమంటున్నాయంటే - Anger Heart Attack Risk

author img

By ETV Bharat Health Team

Published : 9 hours ago

Anger Heart Attack Risk : మితిమీరిన కోపం మనస్సుపై ప్రభావం చూపిస్తుందంటున్నారు వైద్యులు. అలాగే ఆ ప్రభావం శారీరక ఆరోగ్యంపై కూడా పడుతుందంటున్నారు. కోపం అనేది మానవ భావోద్వేగానికి చెందినదైనప్పటికీ, అధిక కోపం వల్ల కానీ కొన్నిసార్లు అనారోగ్య పరిస్థితులకు దారితీసుందని వైద్యులు అంటున్నారు. కొన్ని సందర్భాల్లో గుండె సంబంధ సమస్యలకు దారితీయవచ్చని అంటున్నారు పరిశోధకులు. పరిశోధనలో తేలిన విషయాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Anger Heart Attack Risk
Anger Heart Attack Risk (ETV Bharat)

Anger Heart Attack Risk : తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్షణ అన్నారు పెద్దలు. కోపం ఎంత ఎక్కువైతే మనిషి అన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అనవసరమైన కోపం జీవితంలో ఎన్నో సమస్యలకు కారణమవుతుంది. ఇంకా చెప్పాలంటే అదే కోపం కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారవచ్చంటున్నారు వైద్యులు. ఎప్పుడూ కోపంతో ఊగిపోయే వారికి గుండె సంబంధ సమస్యలు ఎక్కువగా తలెత్తుతాయని పరిశోధకులు అంటున్నారు. ఆ విషయాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కొలంబియా యూనివర్సిటీ ఇర్వింగ్ మెడికల్ సెంటర్, యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్​కు చెందిన డా. ఇయాన్ ఎం. క్రోనిష్, డా. కరీనా డబ్ల్యూ డేవిడ్సన్ చేసిన పరిశోధనల్లో పలు అంశాలు గుర్తించారు. ఈ పరిశోధనలో భాగంగా ఆరోగ్యంగా ఉన్న 18 నుండచి 73 సంవత్సరాల వయస్సు గల 280 మందిపై పరిశోధనలు చేశారు. 280 మందిని 4 గ్రూఫులుగా విభజించారు. వారికి కోపం, బాధ, ఆందోళన, ఒత్తిడి కలిగించే ఘటనలను గుర్తుకు వచ్చేలా చేశారు. ఒక్కో గ్రూపులోని సభ్యులపై సుమారు 8 నిమిషాల పాటు ఈ పరిశోధన చేశారు. తరువాత ఆయా గ్రూపు సభ్యుల రక్త నమూనాలను తీసుకొని పరిశీలించారు. ఒక్కో గ్రూపు సభ్యుల రక్తంలో మార్పులను పరీశీలించారు. బాధ, ఆందోళన, ఒత్తిడి కలిగించే గ్రూపు సభ్యులతో పోల్చితే, కోపానికి గురైన గ్రూపు సభ్యులలో గణనీయమైన మార్పులు సంభవించినట్లు గుర్తించారు.

కోపిష్టి గ్రూపు వారిలో రక్త నాళాలు విస్తరించే సామర్థ్యం గణనీయంగా తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. కొన్ని నిమిషాల పాటు కోపంగా ఉండటం వల్ల గుండెపోటు ప్రమాదం పెరుగుతుందని గుర్తించారు. అంతేకాదు, తీవ్రమైన భావోద్వేగాలు గుండెను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నట్లు ఈ పరిశోధనల ద్వారా తెలుసుకున్నారు. కోపానికి గుండెపోటుకీ మధ్య ఉన్న ప్రత్యక్ష సంబంధంపైన ఈ పరిశోధన ఇదివరకులేని అంశాలపై స్పష్టత ఇచ్చిందని శాస్త్రవేత్తలు అంటున్నారు. 2017లో ప్రచురించిన సైకోసోమాటిక్ మెడిసిన్ అనే జర్నల్​లో ఈ వివరాలు వెల్లడించారు. ఇదే విషయాన్ని NIH బృందం కూడా వెల్లడించింది. (National Cancer Institute రిపోర్ట్​ కోసం ఇక్కడ క్లిక్ చేయండి).

సైకాలజిస్ట్ ఏమంటున్నారు?
ఉత్తరాఖండ్‌కు చెందిన మానసిక వైద్యురాలు డాక్టర్ రేణుక శర్మ, తీవ్రమైన కోపం సమస్యలకు దారితీస్తుందంటున్నారు. కోపం వ్యక్తి మానసిక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా, శారీరక ఆరోగ్యాంపై ప్రభావం చూపిస్తుందని తెలిపారు. కోపం వల్ల అధిక రక్తపోటు, తలనొప్పి సమస్య సాధారణంగా కనిపిస్తాయంటున్నారు. అలాంటి వారిలో గుండె జబ్బులు, గుండెపోటు, పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు. హార్మోన్ల అసమతుల్యతలు దెబ్బతింటాయంటున్నారు. అందుకే కోపాన్ని విలైనంత అదుపులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు.

కోపాన్ని ఎలా అదుపులో ఉంచుకోవాలి?
కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ముఖ్యంగా వ్యాయామం, యోగాసనాలు వేయడం, ధ్యానం చేయడం లాంటివి ఉపకరిస్తాయంటున్నారు డాక్టర్ రేణుక శర్మ. అలాగే మీ ఇష్టమైన అభిరుచులలో ఒక్కదాన్ని ఎంచుకొని అంటే డ్యాన్స్ చేయడం, పుస్తకం చదవడం, సంగీతం వినడం లేదా పెయింటింగ్ చేయడం వంటి వాటిపై ఫోకస్ పెట్టాలంటున్నారు. ఇలా చేయడం వల్ల కొంత మేరకూ ప్రయోజనం చేకురుతుదని డాక్టర్ రేణుక వెల్లడించారు.

ముఖ్య గమనిక : ఈ వెబ్​సైట్​లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

అలర్ట్ : మహిళలు, పురుషుల్లో వేర్వేరుగా - గుండెపోటు లక్షణాలు!

అలర్ట్‌ : మీ బాడీలో ఈ లక్షణాలు కనిపిస్తే - మీకు గుండె జబ్బు ఉన్నట్టే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.