ETV Bharat / state

దేశానికే రోల్​మోడల్​గా స్కిల్ యూనివర్సిటీ - 150 ఎకరాల స్థలం రూ.100 కోట్లు కేటాయింపు : సీఎం - CM Revanth On Skill University - CM REVANTH ON SKILL UNIVERSITY

CM Revanth Reddy On Skill University : తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేసిన 'యంగ్‌ ఇండియా' స్కిల్‌ యూనివర్సిటీని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎం రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, కంపెనీలు ఈ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చిన సీఎం యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేందుకు తమ వంతు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం తరఫున 150 ఎకరాలు భూమితోపాటు వంద కోట్లు నిధులు కూడా కేటాయించినట్లు రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇకపై యూనివర్సిటీ బాధ్యతను బోర్డు ఛైర్మన్ ఆనంద్‌ మహీంద్రాకు అప్పగిస్తున్నామని తెలిపారు

CM Revanth Reddy On Skill University
CM Revanth Reddy On Skill University (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 19, 2024, 10:50 PM IST

CM Revanth Reddy On Young India Skill University : నిరుద్యోగ యువతలో నైపుణ్యాలు పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'యంగ్‌ ఇండియా స్కిల్‌ యూనివర్శిటీ'ని దేశంలోనే ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సంబంధిత అధికారులను సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతోపాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ సచివాలయంలో సమావేశమయ్యారు.

స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు : స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలనే తన ఆలోచనలతోపాటు భవిష్యత్తు ఆకాంక్షలను సీఎం రేవంత్‌ రెడ్డి ఈ సందర్భంగా యూనివర్సిటీ బోర్డుతో, రాష్ట్రంలోని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, వివిధ కంపెనీల ప్రతినిధులతో పంచుకున్నారు. రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు ఈ విశ్వవిద్యాలయంలో భాగస్వామ్యాన్ని పంచుకోవాలని, యువతకు నైపుణ్యాలు నేర్పించి ఉపాధి కల్పించేందుకు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున యూనివర్సిటీకి 150 ఎకరాల స్థలంతో పాటు రూ.100 కోట్లు కేటాయించినట్లు చెప్పారు.

స్కిల్ యూనివర్సిటీ బాధ్యతలు ఆనంద్ మహీంద్రాకు : రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని, యూనివర్సిటీ పూర్తిస్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు, యూనివర్సిటీలో భవనాల నిర్మాణానికి ముందుకు రావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. తమ కంపెనీల పేర్లను లేదా దాతల పేర్లను ఈ భవనాలకు పెట్టాలని అధికారులకు సూచించారు. స్కిల్‌ యూనివర్సిటీ బాధ్యతను బోర్డు ఛైర్మన్ మహీంద్రా ఆనంద్‌కు అప్పగిస్తున్నట్లు సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. తమ ఆలోచనలను వీలైనంత వేగంగా ఆచరణలోకి తెచ్చామని, ఈ రంగంలో అనుభవంతోపాటు ప్రత్యేక గుర్తింపు కలిగిన మహీంద్రా ఆనంద్ స్కిల్ యూనివర్సిటీకి తన బ్రాండ్ ఇమేజీని తీసుకువస్తారనే విశ్వాసం తమకుందన్నారు.

200 ఎకరాల్లో స్పోర్ట్స్ యూనిర్శిటీ : తమ ప్రభుత్వం ఇప్పటి నుంచి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై దృష్టి సారిస్తుందని రేవంత్ వెల్లడించారు. దాదాపు 200 ఎకరాల్లో స్పోర్ట్స్ యూనివర్సిటీ నెలకొల్పి, 2028 ఒలింపిక్స్‌లో ఇండియాకు గోల్డ్ మెడల్ తీసుకురావాలనే లక్ష్యంతో క్రీడాకారులకు శిక్షణను అందిస్తామన్నారు. ఆ యూనివర్సిటీ అభివృద్ధిలో కూడా పాలుపంచుకోవాలని ముఖ్యమంత్రి పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిధుల ఇబ్బంది లేదని రూ.3 లక్షల కోట్ల బడ్జెట్లో వెయ్యి కోట్లు ఖర్చయినా భరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

నైపుణ్యవంతమైన మానవవనరుల కొరత ఉంది : ఆర్థిక సహకారానికి మించి, రాష్ట్రంలోని అందరు పారిశ్రామికవేత్తలు, వ్యాపార వాణిజ్యవేత్తలు ఆశించినంత చొరవ చూపాలని తగిన భాగస్వామ్యం, బాధ్యతలను పంచుకోవాలని కోరారు. డిగ్రీలు, పీజీ పట్టాలు ఉంటే సరిపోదని, ఇంజనీరింగ్ పూర్తి చేసిన లక్షలాది మంది యువకులు ఉద్యోగం ఇప్పించాలని తన వద్దకు వస్తున్నారని తనకు ఎదురైన కొన్ని అనుభవాలను సీఎం ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఏటా లక్షలాది మంది యువకులు డిగ్రీలు, పీజీలు, ఇంజనీరింగ్ పూర్తి చేస్తున్నారని కానీ అందరూ ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పరిశ్రమల అవసరాలకు మానవ వనరుల కొరత ఉందని, దానిని తొలిగించేందుకు స్కిల్ యూనివర్సిటీ నెలకొల్పాలనే ఆలోచన చేసినట్లు ముఖ్యమంత్రి తెలిపారు.

ఐటీ శాఖ మంత్రి వివరణ : యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించిన పలు కీలక అంశాలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పారిశ్రామికవేత్తలకు ఈ సందర్భంగా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి ఆకర్షణీయ గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు కంకణం కట్టుకుందని, అందులో భాగంగా కొత్తగా ఫ్యూచర్ సిటీని నెలకొల్పుతోందని, ఇప్పటికే అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయని అన్నారు. ముఖ్యమంత్రి స్వీయ ఆలోచనతో త్వరలోనే స్కిల్ యూనివర్సిటీ లో కొత్త కోర్సులు ప్రారంభం కావటం ఆనందంగా ఉందన్నారు.

సీఎం రేవంత్ మంచి విజన్ ఉన్న నాయకుడు : తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచన గొప్పదని యూనివర్సిటీ బోర్డు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు. మంచి విజన్ ఉన్న సమర్థనాయకుడు సీఎం రేవంత్ రెడ్డి అంటూ కొనియాడారు. అందుకే యూనివర్సిటీ బోర్డు ఛైర్మన్​గా ఉండాలని సీఎం కోరగానే ఒప్పుకోవాల్సి వచ్చిందని ఆనంద్ మహీంద్రా అన్నారు. సాధారణంగా ప్రభుత్వాలు సబ్సిడీలు, ఆకర్షణీయ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తాయని, కానీ యువతను నిపుణులుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆలోచించిన తీరులోనే దార్శనికత ఉందని అభినందించారు.

ఈ ఏడాది నుంచి కోర్సులు ప్రారంభం : తెలంగాణలోనే అతి పెద్ద యూఎస్ కాన్సులేట్ ఉందని, ఎక్కువ మంది ఇక్కడి నుంచే అమెరికాకు వెళుతున్నారని గుర్తు చేశారు. అలాంటప్పుడు ప్రపంచానికి నైపుణ్యమున్న యువతను అందించే గమ్యస్థానంగా తెలంగాణ నిలబడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. ముఖ్యమంత్రి కల నిజం కావాలని, ఆయన ఆశయం నెరవేరాలనే ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని యూనివర్సిటీ బోర్డు నిర్ణయించింది.

దసరా పండుగ తర్వాత అక్టోబర్ నెలలో కోర్సులను ప్రారంభించనున్నట్లు సూచన ప్రాయంగా వెల్లడించింది. ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఈఎస్సీఐ)లో తాత్కాలికంగా కోర్సులను నిర్వహించనుంది. ముందుగా హెల్త్ కేర్, ఈ కామర్స్ అండ్ లాజిస్టిక్స్ కోర్సులను ప్రారంభించనుంది. ఈ కోర్సుల నిర్వహణకు అపోలోతో పాటు ఏఐజీ, లెన్స్ కార్ట్, ఫ్లిఫ్ కార్ట్, అమెజాన్, అల్కార్గో, ప్రొ కనెక్ట్, ఓ9 సొల్యూషన్స్ కంపెనీలు ముందుకొచ్చాయి. తొలి ఏడాది రెండు వేల మందికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించినట్లు వివరించారు.

ఈ మీటింగ్​లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, కో ఛైర్మన్ శ్రీని రాజు, బోర్డు సభ్యులు పి.దేవయ్య, సుచిత్రా ఎల్లా, సతీశ్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

స్కిల్​ వర్సిటీ కోసం కార్పస్​ ఫండ్​కు రేవంత్​ పిలుపు - రాష్ట్రం తరఫున రూ.100 కోట్లు

దసరా నుంచి స్కిల్​ యూనివర్సిటీలో శిక్షణ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.