Attempt To Murder Case On Hasina : భారత్‌లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను తమ దేశం రప్పించేందుకు బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఇదే సమయంలో ఆమెపై అనేక కేసులు కూడా నమోదవుతున్నాయి. తాజాగా ఓ హత్య అభియోగంపై మరో కేసు నమోదయ్యింది. దీంతో షేక్ హసీనాపై నమోదైన కేసుల సంఖ్య 155కి చేరింది.
ఇటీవల బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక ఘటనల్లో 22 ఏళ్ల విద్యార్థి హత్యకు సంబంధించి హసీనాతోపాటు మరో 58 మందిపై మర్డర్ కేసు నమోదైనట్లు స్థానిక మీడియా పేర్కొంది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్నప్పటి నుంచి హసీనాపై ఇప్పటివరకు 155 కేసులు నమోదయ్యాయి. ఇందులో హత్య కేసులే 136 ఉన్నాయి. మారణహోమం, ఇతర నేరాలకు సంబంధించి ఏడు, మూడు అపహరణ, ఎనిమిది హత్యాయత్నంతోపాటు బీఎన్‌పీ పార్టీ ఊరేగింపుపై దాడికి సంబంధించిన కేసులున్నాయి.