Prabhas Homable Films : 'కేజీయఫ్', 'కాంతార', 'సలార్' సినిమాలతో సినీ ప్రియుల్లో ప్రత్యేక గుర్తింపు సాధించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ తాజాగా ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో మూడు చిత్రాలు చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ సినిమాలు భారతీయ సినిమా స్థాయిని పెంచేలా ఉంటాయని డార్లింగ్ ఫ్యాన్స్‌లో జోష్ నింపింది. మునుపెన్నడూ చూడని సినిమాటిక్ అనుభూతిని ఈ చిత్రాలు అందిస్తాయని ప్రకటించింది.
"ఇండియన్ సినిమా ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసేలా ప్రభాస్‌తో కలిసి మూడు చిత్రాలు చేయనున్నాం. ఆయనతో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఎప్పటికీ గుర్తుండిపోయేలా అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ అందించాలనే మా నిబద్ధతకు సంబంధించిన ప్రకటన ఇది. వేదిక రెడీ అయింది. #Salaar 2తో ఈ ప్రయాణం మొదలు కానుంది. కాబట్టి మీరందరూ రెడీగా ఉండండి." అని పేర్కొంది. 'ది హోంబలే ఈజ్ కాలింగ్ ప్రభాస్' అని చెప్పుకొచ్చింది.
2026, 2027, 2028ల్లో ఈ భారీ ప్రాజెక్ట్‌లు ఉండనున్నట్లు తెలిపింది హోంబలే. అయితే సలార్ 2 తప్ప ఇతర సినిమాలు ఏంటనేవి తెలియజేయలేదు సదరు నిర్మాణ సంస్థ. ఇక ఈ విషయం తెలుసుకుంటున్న ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం రాజాసాబ్ చేస్తున్నారు. త్వరలోనే ఇది రిలీజ్ కానుంది. దీని తర్వాత ఫౌజీ, స్పిరిట్, సలార్ 2, కల్కి 2898 ఏడీ సీక్వెల్ చిత్రాలు చేయనున్నారు. ఇకపోతే విజయ్ కిరంగదూర్ హోంబలే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. పునీత్ రాజ్‌కుమార్ హీరోగా నటించిన నిన్నిందలే చిత్రంతో నిర్మాణ రంగంలోకి అడగుపెట్టారు. 2018లో రిలీజైన 'కేజీయఫ్'తో ఈ హోంబలే సంస్థకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. కాంతార, సలార్ సీజ్ ఫైర్ చిత్రాలు ఆ గుర్తింపును మరింత పెంచాయి. అలాగే అప్పటి వరకు వరుస ఫ్లాపుల్లో ఉన్న ప్రభాస్‌కు సలారే భారీ సక్సెస్‌ను అందించింది. దీనికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించారు.
నిఖిల్ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' రివ్యూ - ఇది ఇప్పటి సినిమా కాదేమో!
గూస్బంప్స్ తెప్పిస్తున్న 'ఘాటి' గ్లింప్స్ - అనుష్కను ఇలా ఎప్పుడు చూసుండరుగా!